IND vs ENG: ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం..
IND vs ENG: ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం..
IND vs ENG: ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం..
IND vs ENG: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు.
7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.