Concussion Substitute Controversy: పూణే టెస్ట్ గెలిచేందుకు ఇంగ్లాండ్ ను భారత జట్టు మోసం చేసిందా ?.. అందరి మదిలో ఎన్నో సందేహాలు
Concussion Substitute Controversy: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ను గెలిచి, టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
Concussion substitute Controversy: పూణే టెస్ట్ గెలిచేందుకు ఇంగ్లాండ్ ను భారత జట్టు మోసం చేసిందా ?.. అందరి మదిలో ఎన్నో సందేహాలు
Concussion Substitute Controversy: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ను గెలిచి, టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. అయితే, ఈ విజయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా, కంకషన్ ప్రత్యామ్నాయ నియమాన్ని భారత్ దుర్వినియోగం చేసిందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. శివం దూబే గాయపడిన తర్వాత హర్షిత్ రాణాను బదులుగా తీసుకురావడం గేమ్‌ను మార్చిన కీలక పరిణామమని చెబుతున్నారు.
పూణే టీ20లో అసలు ఏం జరిగింది?
జనవరి 31న జరిగిన నాలుగో టీ20లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 181 పరుగులు చేసింది. శివం దూబే 53 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతను బౌన్సర్‌కు గురయ్యాడు. ఫిజియో అతన్ని పరీక్షించిన తర్వాత, చివరి రెండు బంతులు ఆడే అవకాశం ఇచ్చాడు. కానీ భారత్ బౌలింగ్ ప్రారంభించిన తర్వాత, హర్షిత్ రాణా కంకషన్ ప్రత్యామ్నాయంగా మైదానంలోకి వచ్చాడు. హర్షిత్ తన తొలి ఓవర్‌లోనే లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేసి మ్యాచ్‌పై ప్రభావం చూపాడు. ఆ తర్వాత, జాకబ్ బెథాల్, జామీ ఓవర్టన్ వికెట్లను కూడా తీసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పరిణామం ఇంగ్లాండ్ క్రికెటర్లలో అసంతృప్తిని రేకెత్తించింది.
ఆకాశ్ చోప్రా - మైఖేల్ వాఘన్ ప్రశ్నలు
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తదితరులు కంకషన్ నియమం సరైన విధంగా అనుసరించలేదని విమర్శించారు.
* మైఖేల్ వాఘన్: "పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఎలా రాబోతాడు?" అని ప్రశ్నించాడు.
* ఆకాశ్ చోప్రా: "దూబేకి సరైన ప్రత్యామ్నాయంగా రమణ్‌దీప్ సింగ్ ఉండాలి. హర్షిత్ ఒక స్పెషలిస్ట్ బౌలర్. ఇది 'లైక్ ఫర్ లైక్' ప్రత్యామ్నాయం కాదని" అన్నారు.
ఐసిసి నియమాలు ఏం చెబుతున్నాయి?
2019లో ఐసిసి కంకషన్ నియమాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, కంకషన్‌కి గురైన ఆటగాడికి ప్రత్యామ్నాయం ఇవ్వొచ్చు, అయితే అది "లైక్ ఫర్ లైక్" (సమాన స్థాయిలో ఆడగల ఆటగాడు) ఉండాలి. కానీ, శివం దూబే ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కాగా, హర్షిత్ రాణా ప్రధానంగా బౌలర్. ఇది సరైన ప్రత్యామ్నాయం కాదని విమర్శలు వస్తున్నాయి.
వివాదం మధ్యలో భారత విజయం
భారత్ 15 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి, సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. కానీ ఈ గెలుపు చుట్టూ వివాదం మిగిలిపోయింది. ఐసిసి దీనిపై అధికారిక విచారణ చేపడుతుందా లేదా అనే అంశం ఇప్పటివరకు స్పష్టత లేదు.