జట్టు ఓటమి పైన కోహ్లి ఏమన్నాడంటే?

ఆసీస్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అయితే జట్టు ఓటమి పైన భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి స్పందించాడు. బౌలింగ్‌ విభాగంలో మేము సత్తాచాటలేకపోయాం.

Update: 2020-11-30 12:39 GMT

ఆసీస్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అయితే జట్టు ఓటమి పైన భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి స్పందించాడు. ''బౌలింగ్‌ విభాగంలో మేము సత్తాచాటలేకపోయాం. సరైన సమయంలో సరైన ప్రదేశాల్లో బంతులు సంధించడంలో మేము విఫలమయ్యాం. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. దానికి తోడు ఇక్కడ పరిస్థితులు వారికి బాగా తెలుసు. కాబట్టి ఛేదన సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఒకటి, రెండు వికెట్లు పడడంతో కావాల్సిన రన్‌రేటు కోసం దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాం" అని కోహ్లి పేర్కొన్నాడు,

అంతేకాకుండా ఆసీస్‌ జట్టు మైదానంలో అవకాశాలను సృష్టించుకొని సాధించిందని అన్నాడు అదే మ్యాచ్‌లో తమకి ఆసీస్ జట్టుకి తమకి తేడా అని, లేకపోతే మ్యాచ్‌ పోటాపోటీగా సాగేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పైన ఆస్ట్రేలియా జట్టు 51 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తొమ్మిది వికెట్లను కోల్పోయి 338 పరుగులకే పరిమితమైంది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే కోహ్లీసేన 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. కాగా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా నామమాత్రపు చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది.

Tags:    

Similar News