IND vs SA 1st ODI : మొదటి వన్డేకు భారత తుది జట్టు ఇదే..కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..ఓపెనర్‌గా జైస్వాల్‌కి ఛాన్స్

IND vs SA 1st ODI : రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది.

Update: 2025-11-29 05:15 GMT

IND vs SA 1st ODI: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది. తొలి వన్డే మ్యాచ్ రాంచీలో జరగనుంది. టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన టీమిండియా, వన్డే సిరీస్‌లో మాత్రం పుంజుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి రానున్నారు. అయితే స్టార్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల తొలి వన్డేలో భారత్ తరఫున ఎవరు ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది.

భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ వంటి ముగ్గురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం, యశస్వి జైస్వాల్ రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. భారత జట్టు కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కే దక్కే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో లేదా శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశం ఉంది.

రాంచీ వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్

Tags:    

Similar News