Ind vs Aus 3rd T20 : పోరాడి ఓడిన భారత్!

ఆసీస్ జట్టుతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. ఆసీస్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది.

Update: 2020-12-08 12:13 GMT

ఆసీస్ జట్టుతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. ఆసీస్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ షాట్ కి ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన కోహ్లి మరో ఓపెనర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుండి నడిపించాడు. ఇద్దరు కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధావన్‌ (28) ఔట్‌ అయ్యాడు. స్వెప్సన్‌ వేసిన అయిదో బంతిని భారీషాట్‌కు యత్నించిన ధావన్‌ , డేనియల్‌ చేతికి చిక్కాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన శాంసన్‌ (10) కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు. ఈ షాక్ నుంచి బయటపడకముందే భారత్ కి మరో షాక్ తగిలింది. 13 ఓవర్లలో స్వెప్సన్‌ వేసిన అఖిరి బంతికి శ్రేయస్‌ అయ్యర్ డకౌట్‌ అయ్యాడు. అప్పటికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి100 పరుగులు చేసింది. ఈ క్రమంలో పాండ్యా, కోహ్లి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టును విజయతీరాలకు నడిపే ప్రయత్నం చేశారు.

అయితే 18 ఓవర్లలో భారత్ కి వరుసగా రెండు షాక్ లు తగిలాయి. హార్దిక్‌ పాండ్యా (20), విరాట్‌ కోహ్లీ (85) వెనువెంటనే అవుట్ అయ్యారు. దీనితో ఆసీస్ విజయం ఖరారు అయిపోయింది. అటు 2-1తో సిరీస్ ని గెలుచుకుంది భారత్.

Tags:    

Similar News