Ind vs Aus 3rd T20 : భారత్‌ టార్గెట్ 187 పరుగులు!

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆసీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి పరుగులు 186 చేసింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

Update: 2020-12-08 10:10 GMT

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆసీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి పరుగులు 186 చేసింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్‌ ఫించ్‌(0) డకౌటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన రెండో ఓవర్‌ లోని నాలుగో బంతికి భారీ షాట్‌ కు ప్రయత్నించిన ఫించ్ హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు.

దీంతో ఆసీస్ జట్టు 14 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్ తో కలిసి జట్టును ముందుండి నడిపించాడు మరో ఓపెనర్ వేడ్‌.. అలా ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ని 50 దాటించాడు. ఈ క్రమంలో వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన పదో ఓవర్‌లో స్టీవ్‌స్మిత్‌(24) ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 79 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే వికెట్లు పడుతున్న కొద్ది వేడ్‌ మాత్రం దూకుడుగా ఆడుతూ తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.

వేడ్‌ కు మాక్స్‌వెల్‌ కూడా తోడవ్వడంతో జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే మాక్స్‌వెల్‌ కూడా తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే మొదటినుంచి దూకుడుగా ఆడుతున్నవేడ్‌ (80) శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 18.2వ బంతికి ఔటయ్యాడు. ఇక చివర్లో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ తల చేయి వేయడంతో ఆసీస్ అయిదు వికెట్లను నష్టపోయి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్ తీశారు. 

Tags:    

Similar News