IND vs AUS: భారత్‌- ఆసిస్ 4టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇరుజట్లు రెడీ

IND vs AUS: హోరా హోరీగా సాధన చేస్తున్న ఇరు దేశాల జట్లు

Update: 2023-02-09 02:09 GMT

IND vs AUS: భారత్‌- ఆసిస్ 4టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇరుజట్లు రెడీ 

IND vs AUS: ఆస్ట్రేలియా-భారత్ మధ్య 4 టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌కు ఇరుజట్లు సర్వం సన్నద్ధం అవుతున్నాయి. భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా టీం ఉవ్వీళ్లూరుతోంది. రేపు నాగ్‌పూర్‌లో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఇరుజట్లు హోరా హోరీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో తలపడే యాఫెస్‌నే అత్యత్తమ సిరీస్‌గా పరిగణిస్తుంటారు. తమ వరకు దాన్ని మించి సిరీస్ లేదంటారు. ఆ విజయాన్ని గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారింది. భారత్‌తో ఆడబోయే టెస్టు సిరీస్‌ను యాషెస్‌తో సమానం అని కొందరంటుంటే ఇందులో విజయం సాధిస్తే యాషెస్‌ను మించిన విజయం అవుతుందని కొందరంటున్నారు. ఆసిస్ మాత్రం 2004 తర్వాత భారత్‌లో సిరీస్ విజయం దక్కని అసంతృప్తితో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా దాని గడ్డపై పరాభవం మిగిల్చిన భారత్ ఇప్పుడు సూపర్ ఫామ్‌తో తమ దేశానికి వచ్చిన ఆ జట్టును ఇక్కడా దెబ్బకొట్టి ఆధిపత్యాన్ని చాటాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో స్పిన్నర్లదే అత్యంత కీలక పాత్ర అని సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేది వాళ్లేనని ఇరుజట్లు భావిస్తున్నాయి.

భారత జట్టులో ఇంకా కుల్‌దీప్, జడేజా, అక్షర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లున్నారు. వీరికి భారత పిచ్‌లు కొట్టిన పిండిలాంటిది. వీరిలో ఎవరు తుది జట్టులో ఉన్నా పిచ్ సహకరిస్తే కంగారూలకు ఇబ్బంది కలిగించడం ఖాయం. ఆస్ట్రేలియా జట్టులో అగార్, స్వెప్పన్, మర్చీల రూపంలో మరో ముగ్గురు స్పిన్నర్లున్నారు. వీరు ప్రతిభావంతులైనా భారత పిచ్‌లపై ఆడిన అనుభవంలేదు.

Tags:    

Similar News