హైదరాబాద్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టులో జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేశారు.

Update: 2020-06-05 04:02 GMT

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టులో జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేశారు.అంతకముందు ఈ టోర్నీని ఆగస్టు 11 నుంచి 16 వరకూ జరగాల్సిన బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్ణయించింది. కరోనా సృష్టించిన అనిశ్చితి నుంచి ఎప్పటికి బయటపడతామో తెలియని కారణంగా టోర్నీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అంగీకరించిందని వెల్లడించింది.

ఇక ఇతర దేశాల్లో నిర్వహించాల్సిన టోర్నీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీడబ్ల్యూఎఫ్ మాఖ్య కార్యదర్శి థామస్ లాండ్ వెల్లడించారు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా హైదరాబాద్ లో టోర్నీని నిర్వహించడం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సాహసమే అవుతుందని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. టోర్నీ వాయిదా సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. 

Tags:    

Similar News