IND VS SA: బ్యాట్స్‌మెన్ల పాలిట యముడిలా మారిన భారత బౌలర్.. బంతితో అద్భుతాలు ఎలా చేస్తున్నాడో తెలుసా?

మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్తి రికార్డులు నెలకొల్పాడు.

Update: 2021-12-29 09:30 GMT

IND VS SA: బ్యాట్స్‌మెన్ల పాలిట యముడిలా మారిన భారత బౌలర్.. బంతితో అద్భుతాలు ఎలా చేస్తున్నాడో తెలుసా?

Mohammed Shami: సెంచూరియన్ టెస్ట్ మూడో రోజు, మైదానంలో మహ్మద్ షమీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా టీమ్ ఇండియా 130 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మహ్మద్ షమీ సౌతాఫ్రికా జట్టు పాలిట యముడిలా మారాడు. ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 44 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే షమీ టెస్ట్ క్రికెట్‌లో తన 200 వికెట్లను కూడా పూర్తి చేశాడు. భారత్ తరఫున అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రతి పిచ్‌లోనూ బాగా బౌలింగ్ చేసే మహ్మద్ షమీలోని లక్షణాలు ఏంటో చూద్దాం. 22 గజాల స్ట్రిప్‌లో ఎర్రటి బంతితో మ్యాజిక్ చేస్తూ కనిపించిన షమీలో అంత నైపుణ్యం ఎలా వచ్చింది? ప్రస్తుత యుగంలో అత్యంత ప్రమాదకరమైన టెస్ట్ బౌలర్‌గా మారడానికి షమీలో ఉన్న కొన్ని లక్షణాలను ఇప్పుడు చూద్దాం.

బౌలింగ్ యాక్షన్..

మహ్మద్ షమీ అద్భుతమైన లైన్-లెంగ్త్‌కి కారణం అతని బౌలింగ్ యాక్షన్ చాలా ముఖ్యమైన కారణం. ఏ బౌలర్ అయినా బంతిని ఖచ్చితమైన లైన్-లెంగ్త్‌పై విసరాలంటే మాత్రం కచ్చితంగా బౌలింగ్ యాక్షన్ బాగుండాలి. ఇందులో మహ్మద్ షమీ ముందంజలో ఉంటాడనేది సత్యం. ఇందుకు కారణం బంతిని విసిరేటప్పుడు అతని చేయి చెవి దగ్గర నుంచి వస్తుంది. దీనితో పాటు, అతని మణికట్టు స్థానం కూడా చాలా నిటారుగా ఉంటుంది. దీని కారణంగా బంతిని ఎక్కడ కావాలంటే అక్కడ వేయగలడు.

షమీకి అదనపు బలం బౌన్స్, రివర్స్ స్వింగ్..

మహ్మద్ షమీ సీమ్ స్థానం అతనికి అదనపు బౌన్స్‌ను అందిస్తుంది. అలాగే, అతని భుజాలు చాలా బలంగా ఉంటాయి. దాని కారణంగా షమీ మరింత శక్తితో పిచ్‌పై బంతిని వేగంగా విసరగలడు. అతను పాత బంతి నుంచి కూడా అదనపు బౌన్స్ పొందటానికి ఇదే కారణం. షమీ కొత్త బంతితో వికెట్లు పడకపోతే.. పాత బంతితో రివర్స్ స్వింగ్ చేయడంలో నిష్ణాతుడిగా వ్యవహరిస్తాడు. కొత్త, పాత బంతులతో షమీ చాలా ప్రమాదకరంగా మారతాడనండంలో సందేహం లేదు.

ఫిట్‌నెస్, డైట్..

డైట్, ఫిట్‌నెస్ విషయంలో మహ్మద్ షమీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంతకుముందు తాను బిర్యానీని ఎక్కువగా తినేవాడినని ఓ ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. అలాగే శిక్షణపై పెద్దగా దృష్టి పెట్టలేదని కూడా తెలిపాడు. కానీ, ఆ తర్వాత అతను తన డైట్‌పై శ్రద్ధ పెట్టడంతోపాటు బౌలింగ్ చేసేటప్పుడు అతని బలం మరింత పెరిగింది.

నెట్స్‌లో హార్డ్ వర్క్..

నెట్స్‌లో కష్టపడడమే మహమ్మద్ షమీ విజయ రహస్యంగా నిలిచింది. షమీ బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అతను ప్రణాళికాబద్ధంగా బౌలింగ్ చేస్తాడు. షమీ టీమ్ ఇండియాతో లేనప్పుడు కూడా తన గ్రామంలో నెట్స్‌లో చెమటలు పట్టిస్తుంటాడు.

Tags:    

Similar News