ఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
IPL 2022 - Gujarat Titans: 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసిన గుజరాత్...
ఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
IPL 2022 - Gujarat Titans: టీ20 లీగ్‌లో గుజరాత్ ఫైనల్‌కు చేరుకుంది. ఊహించినట్లే తొలి క్వాలిఫయర్ మ్యాచ లో గుజరాత్ ఫైనల్ కుదూసుకెళ్లింది. ఆఖరి ఓవర్ వరకూ ఆధ్యంతరం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలిచింది.
డేవిడ్ మిల్లర్ 68 అర్ధశతకం సాధించగా.. హార్దిక్ పాండ్య 40, శుభ్‌మన్ గిల్ 35, మ్యాథ్యూ వేడ్ 35 రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మెక్‌కాయ్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ విజయంతో గుజరాత్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. రాజస్థాన్‌కు మరొక అవకాశం క్వాలిఫయర్-2 రూపంలో ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ-బెంగళూరు మధ్య ఎవరు నెగ్గితే వారితో రాజస్థాన్ తలపడుతుంది. మే 25న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది
ఇక చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా ప్రసిద్ కృష్ణ వేసిన చివర ఓవర్ మొదటి 3 బంతులను డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ రాజసంగా ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. ఇక గుజరాత్ టీమ్ లోని వృద్ధిమాన్ సాహా 0, శుభ్‌మన్ గిల్35, మాథ్యూ వేడ్35, హార్ధిక పాండ్యా40, డేవిడ్ మిల్లర్68 పరుగులు చేస్తే.. ఇక హమ్మద్ షమీ, యస్ దయాల్, సాయి కిశోర్ , హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. మరో 2 రనౌట్లు ఉన్నాయి.