IPL 2025: ఆడడానికి వచ్చారా.. మెక్కి తిని, తిరగడానికి వచ్చారా? విదేశీ ఆటగాళ్లపై సెహ్వాగ్‌ ఫైర్

IPL 2025: ఈ విమర్శలతో మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ తాము ఎలాంటి ప్రదర్శనతో బదులిస్తారో ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Update: 2025-04-20 14:16 GMT

IPL 2025: ఆడడానికి వచ్చారా.. మెక్కి తిని, తిరగడానికి వచ్చారా? విదేశీ ఆటగాళ్లపై సెహ్వాగ్‌ ఫైర్

IPL 2025: విదేశీ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్‌లపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం తమ ఫ్రాంచైజీల నుంచి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున, లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ తగిన ప్రదర్శన కనబరచలేకపోయారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ ఫలితాలు లేకపోవడంతో ఇద్దరినీ బెంచ్‌కు పంపించారు.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్ వీరిద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వీరికి ఆటపై ఆసక్తి లేదని, విజయం సాధించాలన్న తపన లేదని ఆరోపించారు. ఇండియాకి వాచ్చేది సెలవుల కోసమే కానీ గెలుపు కోసం కాదన్నారు. వారి ప్రదర్శనలో పట్టుదల కనిపించడం లేదని, గతంలో ఉన్న జ్వాల మిస్సయ్యిందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే, మ్యాక్స్‌వెల్‌తో సెహ్వాగ్‌కు గతంలో పంజాబ్ కింగ్స్‌ జట్టులో ఉన్నప్పుడు విభేదాలు చోటు చేసుకున్నాయని చెప్పడం తెలిసిందే. ఆ విషయాన్ని మ్యాక్స్‌వెల్ తన పుస్తకంలో కూడా ప్రస్తావించాడు. జట్టు ఎంపిక విషయంలో సెహ్వాగ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు జట్టులో కలహాలకు దారి తీసినట్టు వివరించాడు.

ఓ సీజన్‌ చివరలో జరిగిన మీడియా సమావేశంలో సెహ్వాగ్ తనను తీవ్రంగా విమర్శించారని మ్యాక్స్‌వెల్ తన రచనలో పేర్కొన్నాడు. అదే సమయంలో జట్టు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడ్డానని, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కూడా తాను విడిచిపెట్టాలని చెప్పినట్టు తెలిపాడు. సెహ్వాగ్ మాత్రం ఈ వివాదానికి పెద్దగా స్పందించకపోయినా, ఇప్పటి వ్యాఖ్యల్లో మ్యాక్స్‌వెల్ సహా మరికొంతమంది విదేశీ ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌ను ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారని, ఆటపై నిజమైన నిబద్ధత చూపించడం లేదని అభిప్రాయపడ్డారు.

ఇక ఇదే నేపథ్యంలో, ఆటపై ఆసక్తి ఉన్న విదేశీ ఆటగాళ్లు ఎవరెవరంటే వారిలో డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి వాళ్లే మినహాయింపుగా నిలుస్తారని అన్నారు. ఆటను గెలిపించేందుకు ముందు వరుసలో ఉండే వారే నిజమైన ఆటగాళ్లని సెహ్వాగ్ స్పష్టం చేశారు. ఈ విమర్శలతో మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ తాము ఎలాంటి ప్రదర్శనతో బదులిస్తారో ఇప్పుడు ఆసక్తిగా మారింది. తమపై వచ్చిన విమర్శలను సీరియస్‌గా తీసుకుంటారా, లేక నిశ్శబ్దంగా ఉండిపోతారా అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News