ఇది కోహ్లి కెప్టెన్సీ వైఫల్యం : గంభీర్

అసలు కోహ్లి కెప్టెన్సీ ఏంటో తనకి అర్ధం కావడం లేదని అన్నాడు. జరిగిన రెండో వన్డేలో ఆరంభంలో జస్ప్రీత్‌బుమ్రాను రెండు ఓవర్లే బౌలింగ్‌ చేయించడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు గంభీర్.

Update: 2020-11-30 10:05 GMT

ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా జరిగిన రెండు వన్డేలో భారత జట్టు ఓడిపోవడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇండియన్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన విరుచుకపడ్డాడు. అసలు కోహ్లి కెప్టెన్సీ ఏంటో తనకి అర్ధం కావడం లేదని అన్నాడు. జరిగిన రెండో వన్డేలో ఆరంభంలో జస్ప్రీత్‌బుమ్రాను రెండు ఓవర్లే బౌలింగ్‌ చేయించడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు గంభీర్.

ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పుడు టాప్‌ ఆర్డర్‌ వికెట్లు తీయడం చాలా ముఖ్యం. సహజంగా అయితే వన్డేల్లో బౌలర్లకు 4-3-3 ఓవర్ల చొప్పున స్పెల్‌ పద్ధతి ఉంటుంది. అలాంటి సమయంలో బౌలర్లకి రెండు ఓవర్లకు పరిమితం చేయడం ఏంటో తనకి అర్థంకాలేదని అన్నాడు. ఇది టీ20 సిరీస్‌ కూడా కాదని, ఇది పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యమేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అటు ఆసీస్, భారత్ జట్ల మధ్య రేపు మూడో వన్డే జరగనుంది.

ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలు కావడంతో టీంఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. #Rohitsharma హాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. వన్డేల్లో, టీట్వంటీలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ శర్మ సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగకరమని ఫ్యాన్స్ అంటున్నారు. అటు టీంఇండియా ఓడిన చివరి ఎనమిది వన్డేలలో రోహిత్ శర్మ లేకపోవడం గమనార్హం. ఈ ఏడాదిలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టును విజేతగా నిలబెట్టాడు రోహిత్.

Tags:    

Similar News