BCCI: సచిన్ నుండి ధోని వరకు..ఈ దిగ్గజ ఆటగాళ్లకు BCCI ఎంత పెన్షన్ చెల్లిస్తుందో తెలుసా?
How much Pension BCCI Pays to these Legendary Players
BCCI: క్రికెట్ కు మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ క్రికెట్ కు ఎక్కువ ఆదరణ మన దేశంలోనే కనిపిస్తుంది. భారత క్రికెటర్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సచిన్ వంటి క్రికెట్ దిగ్గజాల గురించి అందరికీ తెలిసిందే. వారు ఫామ్ లో ఉన్నప్పుడు అభిమానుల హడావుడి మామూలుగా ఉండేది క ాదు. అయితే బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు పెన్షన్ అందిస్తుంది. మరి సచిన్ నుంచి ఎం ఎస్ ధోనీ వరకు ఈ ఆటగాళ్లు ఎంత పెన్షన్ తీసుకొంటున్నారో తెలుసా?
సునీల్ గవాస్కర్:
ఈ జాబితాలో మొదటి పేరు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయనకు రూ. 70వేల పెన్షన్ అందిస్తుంది బిసిసిఐ. 5 టెస్ట్ మ్యాచులు ఆడిన వారికి మాత్రమే పెన్షన్ ఇస్తుంది బిసీసీఐ
సచిన్ టెండూల్కర్
క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ కు బీసీసీఐ రూ. 70వేల పెన్షన్ ఇస్తుంది.
ఎంఎస్ ధోని
భారతజట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ. 70వేల పెన్షన్ అందిస్తుంది బీసీసీఐ
ఇర్ఫాన్ పఠాన్
లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కు బీసీసీఐ రూ. 60వేల పెన్షన్ ఇస్తుంది.
యువరాజ్ సింగ్
భారత జట్టు డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ బీసీసీఐ 60వేల పెన్షన్ అందిస్తుంది. ఆయన 2022వ సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.