BCCI Did Not Treat MS Dhoni : ధోనికి బీసీసీఐ సరైన పద్ధతిలో వీడ్కోలు చెప్పలేదు : పాక్ మాజీ క్రికెటర్

BCCI Did Not Treat MS Dhoni ; ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే..

Update: 2020-08-24 07:49 GMT

MS Dhoni

BCCI Did Not Treat MS Dhoni ; ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందరికి పెద్ద షాక్ ఇస్తూ తన రిటైర్మెంట్‌ ని ప్రకటించాడు ధోని.. అయితే జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ లేకపోవడం పట్ల క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అందులో భాగంగానే పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు సక్లైన్‌ ముస్తాక్‌ బీసీసీఐ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.. గొప్ప సారథికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించాడు..

" ప్రతి క్రికెటర్ కి కచ్చితంగా ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుంది.. వీడ్కోలు చెప్పక తప్పదు కూడా.. ధోని నా ఫేవరెట్‌ క్రికెటర్‌.. అతను గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. గొప్ప ఫినిషర్ కూడా.. పోరాడే నాయకుడు అతను.. చూడడానికి చాలా ప్రశాంతగా కనిపించే ధోని చాలా ప్రభావితం చేయగలుగుతాడు.. ధోని సామాన్యమైన ఆటగాడు కాదని, నూటికి ఒక్కడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు ఈ మాజీ ఆటగాడు.. ప్రస్తుతం టీంఇండియా ఈ స్థానంలో ఉండడానికి అతనే కారణం కూడా.. ధోనిని నాలా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. అతని చివరి మ్యాచ్ ని చూడాలని చాలా మంది అనుకున్నారు" అని అభిప్రాయ పడ్డారు సక్లైన్‌ ముస్తాక్‌..

ఇక ఇలాంటి గొప్ప క్రికెటర్ విషయంలో బీసీసీఐ సరిగ్గా ప్రవర్తించలేదని అన్నాడు.. ఇంత గొప్ప ఆటగాడికి బీసీసీఐ సరైన పద్ధతిలో వీడ్కోలు చెప్పలేదని అన్నాడు.. ఇలా అన్నందుకు తానూ బీసీసీఐకి క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించాడు... ప్రతీ క్రికెటర్‌ కూడా తన కెరీర్ లో చాలా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడని, ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదని స్పష్టం చేశాడు.. ఇక చివరగా ధోని అసలైన హీరో అని, అతడో వజ్రం వంటి మనిషి అంటూ వెల్లడించాడు సక్లైన్‌ ముస్తాక్‌.. 

Tags:    

Similar News