Anaya Bangar: బిగ్ బాస్ షోకు సెలక్ట్ అయిన లేడీగా మారిన మేల్ క్రికెటర్..కప్ కొట్టేనా ?
Anaya Bangar: సంచలనం సృష్టించే ఒక వార్త ఇప్పుడు టీవీ ప్రేక్షకులను, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
Anaya Bangar: బిగ్ బాస్ షోకు సెలక్ట్ అయిన లేడీగా మారిన మేల్ క్రికెటర్..కప్ కొట్టేనా ?
Anaya Bangar: సంచలనం సృష్టించే ఒక వార్త ఇప్పుడు టీవీ ప్రేక్షకులను, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్‌కు బిగ్ బాస్ 19 సీజన్‌కు ఆహ్వానం అందినట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. అమ్మాయిగా మారిన తర్వాత అనయ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ పాపులర్ రియాలిటీ షోలో ఆమె పాల్గొంటే, అది ఒక పెద్ద సంచలనంగా మారడం ఖాయం. బిగ్ బాస్ 19 ఈ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.
అనయ బంగర్, భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె. ఆమె మొదట్లో అబ్బాయిగా, ఆర్యన్ బంగర్ అనే పేరుతో క్రికెట్ ఆడేది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లతో కలిసి జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంది. ఆల్ రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, కాలక్రమేణా తన నిజమైన గుర్తింపును వెతుక్కుంటూ లింగ మార్పిడికి సిద్ధపడింది.
2021లో అనయ యునైటెడ్ కింగ్‌డమ్‌లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించి, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. ఈ మార్పు ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో తనకు వచ్చిన కష్టాలను, భావోద్వేగాలను సోషల్ మీడియాలో నిర్భయంగా పంచుకుంది. ఆమెకు తన కుటుంబం, ముఖ్యంగా సోదరుడు అండగా ఉన్నారని తెలిపింది. ఈ కఠినమైన ప్రయాణంలో ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.
బిగ్ బాస్ వంటి షోలో పాల్గొనడానికి అనయ బంగర్ సరైన వ్యక్తి అని చాలామంది భావిస్తున్నారు. ఈ షోకు కావలసిన ధైర్యం, నిర్భయంగా మాట్లాడే తత్వం ఆమెలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తమ పాలసీలను మార్చాలని, లింగ మార్పిడి చేసుకున్న క్రీడాకారులను కూడా మహిళల క్రికెట్‌లో భాగం చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసింది. దీనికి మద్దతుగా లండన్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీతో కలిసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్‌ను కూడా విడుదల చేసింది.
అనయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తుంది. ఆమెకున్న ఈ ధైర్యం, నిజాయితీ, అలాగే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం బిగ్ బాస్ షో మేకర్స్‌ను ఆకర్షించి ఉండవచ్చు. ఆమె గనుక షోలోకి వస్తే దేశంలో ట్రాన్స్‌జెండర్ ప్రాతినిధ్యానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అనయ బంగర్‌కు బిగ్ బాస్ 19 నుండి ఆఫర్ వచ్చింది కానీ, ఆమె ఇంకా అధికారికంగా ఆ షోలో పాల్గొనడానికి అంగీకరించలేదని సమాచారం. దీనిపై ఆమె లేదా ఆమె కుటుంబం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. బిగ్ బాస్ ఈ కొత్త సీజన్ ఘర్వలోన్ కీ సర్కార్ అనే పొలిటికల్ థీమ్‌తో రాబోతోంది. పోటీదారులు పార్టీలను ఏర్పాటు చేయడం, ఎన్నికలు నిర్వహించడం వంటివి ఈ సీజన్ ప్రత్యేకత. ఈ కొత్త ఫార్మాట్‌లో అనయ ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.