IND vs AUS: ఆసీస్, భారత్ మూడో టెస్ట్‌లో ముగిసిన తొలిరోజు ఆట
IND vs AUS: తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే టీమిండియా ఆలౌట్
IND vs AUS: ఆసీస్, భారత్ మూడో టెస్ట్‌లో ముగిసిన తొలిరోజు ఆట
IND vs AUS: ఆస్ట్రేలియా , భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోయారు. దీంతో భారత్ 109 పరుగులకే అలౌట్ అయింది. విరాట్ 22 పరుగులతో టాప్ స్కోరర్ కాగా... ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 5, లయన్ 3, మర్ఫీ ఒక వికెట్ పడగొట్టారు. ఆసీస్ బౌలర్లు ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదు. తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజ్‌లో కామెరూన్ గ్రీస్, పీటర్ హ్యాండ్స్‌కాంట్ ఉన్నారు. ఆసీస్ మొదటి రోజు 47 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు తీశాడు. భారత బౌలర్లు మొదటి రోజు ఎక్స్‌ట్రాల రూపంలో 17 పరుగులు సమర్పించుకున్నారు.