IPL 2021: ప్రేక్షకులకు అనుమతి: ఈసీబీ

IPL 2021: కొవిడ్‌తో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Update: 2021-05-31 13:30 GMT

ఐపీఎల్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021: కొవిడ్‌తో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌‌ 2021ను యూఏఈ వేదికగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10 మధ్యలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించారు. అయితే, ప్రస్తుతం యూఏఈలో కరోనా అదుపులోనే ఉండటంతో పాటు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారంట. దీంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతీ మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీబీ ప్లాన్ చేస్తుందంట. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే లాంటి విషయాలపై బీసీసీఐ బృందం వచ్చే బుధవారం ఈసీబీ అధికారులతో మాట్లాడనుంది.

Tags:    

Similar News