Kohli - Dhoni: విరాట్ కోహ్లి.. ధోని మాట వినడం లేదా..?? అసలేం జరిగింది.??

Update: 2021-10-26 12:18 GMT

Kohli - Dhoni: విరాట్ కోహ్లి.. ధోని మాట వినడం లేదా..?? అసలేం జరిగింది.?? 

Virat Kohli - Dhoni: భారత మాజీ కెప్టెన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోని మాట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వినడం లేదా.?? ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం తరువాత నెటిజన్లు ఒక్కోరు ఒక్కోరకంగా తమకి నచ్చినట్లుగా మాట్లాడుకోవడం, కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ధోని పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన సమయంలో ఇషాన్ కిషన్ ద్వారా పంపిన సలహాలు, సూచనలు విరాట్ కోహ్లి పాటించలేదని అందుకే టీమిండియా చిత్తుగా ఓడిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇక అసలు విషయానికొస్తే టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా టీమిండియాకి మెంటార్ గా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర సింగ్ ధోని.. పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు రోజు మొత్తం భారత ఆటగాళ్ళ నెట్ ప్రాక్టీసులోనే ఉండటం.. అది కూడా ధోని పర్యవేక్షణలో కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీసు చేయడం చూశాము. వారిద్దరు కలిసి మ్యాచ్ రోజు గ్రౌండ్ లో సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం చూశాము.

అయితే జట్టు కూర్పులో భువనేశ్వర్ కుమార్ తో పాటు వరుణ్ చక్రవర్తిని శార్దుల్ టాకూర్, రవిచంద్రన్ అశ్విన్ లకు బదులుగా తీసుకోవడం వల్లనే విరాట్ కోహ్లి.. ధోని మాట వినడం లేదని వార్తలు కొంతమంది కట్టకట్టుకొని అటు కోహ్లి, ధోనిలపై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్ధమవుతుంది. చివరి వరకు భువనేశ్వర్ స్థానంలో శార్దుల్ టాకూర్ స్థానం కల్పిస్తారని అనుకోవడం అందులోను శార్దుల్ టాకూర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఆటగాడు కావడంతో ఈ అసత్యపు వార్తలకు మరింత బలం చేకూరింది.


భారత జట్టుకు మెంటార్ గా ఉన్న మహేంద్రుడు రానున్న మ్యాచ్ లలో తన మార్క్ చూపిస్తాడని, టీమిండియా ఆటగాళ్ళు సైతం పాక్ ఓటమితో మేల్కొని తరువాతి మ్యాచ్ ల నుండి విజయపరంపర కొనసాగిస్తారని ఆశిద్దాం.. చివరగా ధోని మాట కోహ్లి వినలేదని అనే కొంతమంది అదే ధోని పర్యవేక్షణలో రాత్రి వరకు నెట్ ప్రాక్టీసు చేసి పాక్ మ్యాచ్ లో అర్ధసెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే.. మరి ఈ క్రెడిట్ ధోని దా..? విరాట్ దా..? ఇద్దరిదా అనే విషయం తెలుసుకోవాలి.. ఓటమికి ఒక్కరిని బలి చేసి.. విజయాన్ని మాత్రం అందరు సంబరాలు చేసుకోవడం ఎంత వరకు మంచిది..!?



Tags:    

Similar News