Eng Vs Pak: ఇవాళ టీ20 ప్రపంచకప్ ఫైనల్
* మెల్‌బోర్న్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్
ఇవాళ టీ20 ప్రపంచకప్ ఫైనల్
England Versus Pakistan: టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న మెల్‌బోర్న్‌లో ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరి ఈ పొట్టి ప్రపంచకప్‌లో విజేత ఎవరనేది ఒక్క రోజులో తేలనుంది. ఇక ఈ మ్యాచ్ లో సెంటిమెంట్ పరంగా చూస్తే పాక్ గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే కానీ రికార్డులన్నీ ఇంగ్లండ్ కే అనుకూలంగా ఉన్నాయి. ఈ ఇరుజట్లు 28 టి20ల్లో ఎదురుపడితే వాటిలో ఇంగ్లండ్ 18 సార్లు గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్భాల్లోనూ... ఇంగ్లండ్‌నే విజయం వరించింది. చివరగా టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ లోనూ 4-3 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలా ఏలెక్కన చూసుకున్నా ఇంగ్లండ్‌దే విజయమని.. పాక్ టైటిల్ కొట్టడం కష్టమేనని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా మరీ ఈరెండు జట్లలో ఏది ఈసారి టీ20 ప్రపంచవిజేతగా నిలుస్తుందో చూడాలి