Eng vs Bangla: ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్ 124/9
T20 World Cup 2021 - England vs Bangladesh: బంగ్లాదేశ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
England vs Bangladesh: ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్ 124/9
T20 World Cup 2021 - England vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్ మధ్య అబుదాభిలోని షేక్ జాయద్ స్టేడియం వేదికగా గ్రూప్ 1 లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఇప్పటివరకు టీ20 లలో తలపడని బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్ జట్లు తొలిసారిగా పోటీపడుతున్న ఈ మ్యాచ్ లో మొయిన్ అలీ వేసిన మూడో ఓవర్ లో వరుసగా రెండు బంతులకు బంగ్లాదేశ్ ఓపెనర్లు దాస్, నయీం లను అవుట్ చేసి పెవిలియన్ పంపాడు.
ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన షకిబ్ ఉల్ హసన్ ని క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. ఇలా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ స్కోర్ బోర్డుకి ముసాఫిర్ రెహ్మాన్ 29 వ్యక్తిగత పరుగులు జోడించి ఎల్బిడబ్యు గా లివింగ్ స్టన్ బౌలింగ్ లో అవుట్ అయి వెనుతిరిగాడు.
ఆ వెంటనే హోసైన్ రనౌట్ అవడంతో కష్టాల్లో పడిన బంగ్లా జట్టు స్కోర్ బోర్డుని కెప్టెన్ మహ్మదుల్ల గాడిన పెట్టె ప్రయత్నం చేసిన 19 పరుగులకే ఔటై వెనుతిరిగాడు. ఇలా బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు చేయక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బ్యాటింగ్: 124/9(20 ఓవర్లు)
- ముసాఫిర్ రెహ్మాన్ 29
- మహ్మదుల్ల 19
- నసుం అహ్మద్ 19
- ఇంగ్లాండ్ బౌలింగ్ :
- మొయిన్ అలీ 3-18-2
- లివింగ్ స్టన్ 4- 15 -2