Dale Steyn: 300 కొడతాడని జ్యోష్యం చెప్పాడు.. చివరకు ముంబై ఫ్రాంచైజీతో చివాట్లు తిన్నాడు!

Dale Steyn: డేల్ స్టెయిన్ '300' కామెంట్లపై ముంబై సెటైర్ వేసింది.'డేల్ స్టెయిన్ చెప్పినట్లే 328 పరుగులు వచ్చాయి. కానీ అవి రెండు జట్లు కలిపి చేసిన స్కోరు అంటూ ట్విట్టర్‌లో కౌంటర్‌ వేసింది.

Update: 2025-04-19 01:30 GMT

Dale Steyn: 300 కొడతాడని జ్యోష్యం చెప్పాడు.. చివరకు ముంబై ఫ్రాంచైజీతో చివాట్లు తిన్నాడు!

Dale Steyn

300 కొడతారన్నారు.. కాటేరమ్మ కొడుకుల పూనకాల జాతరే అని విర్రవీగారు.. సీన్‌ కట్‌ చేస్తే 162పరుగులకు తుస్సుమన్నారు. ఇక క్రికెట్ లో బాబా వంగాగా పేరుగాంచిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల స్కోరును దాటుతుందని ముందుగా ప్రకటించాడు. డేల్ స్టెయిన్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు.'ఇది ఒక చిన్న అంచనా. ఏప్రిల్ 17న ఐపీఎల్ లో మొదటి 300 పరుగులను చూస్తాము. ఎవరికి తెలుసు.. బహుశా నేను దానిని చూడడానికి అక్కడ ఉంటాను." అని రాసుకొచ్చాడు. అయితే డేల్ స్టెయిన్ '300' కామెంట్లపై ముంబై సెటైర్ వేసింది.'డేల్ స్టెయిన్ చెప్పినట్లే 328 పరుగులు వచ్చాయి. కానీ అవి రెండు జట్లు కలిపి చేసిన స్కోరు అంటూ ట్విట్టర్‌లో కౌంటర్‌ వేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు కల్లబెట్టేలా ఐపీఎల్ 2025 సీజన్ ముందుకెళ్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసి అత్యుత్తమ విజయం నమోదు చేసిన జట్టు, ఆ తర్వాత మాత్రం నిరంతర పరాజయాలతో పోటీ నుంచి క్రమంగా వెనకపడుతోంది. తాజా మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన సన్‌రైజర్స్, సీజన్‌లో ఇప్పటికే ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఒకప్పుడు టైటిల్ దక్కించుకునే ప్రబలంగా కనిపించిన హైదరాబాద్, ఇప్పుడు పాయింట్ల పట్టికలో తుదిపాయల వద్ద కొట్టుమిట్టాడుతోంది. మిగిలిన మ్యాచ్‌లు విన్నింగ్స్ కాకపోతే... ప్లే ఆఫ్స్‌ రేసు కాస్త కష్టంగా మారబోతోంది. 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే అందుకున్న సన్‌రైజర్స్, ఇప్పుడు టాప్-4కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో అన్నింటిలోనూ గెలవాల్సిందే. ఇలా చేస్తేనే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఆశించవచ్చు.

అంతేగాక, నెట్ రన్‌రేట్ ప్రస్తుతం బాగా నెగటివ్‌లో ఉండటం సన్‌రైజర్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. ప్లే ఆఫ్స్ చేరడం ఒక్కటీ కాదు, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచడం మరో పెద్ద టాస్క్. బ్యాటింగ్ విఫలమవ్వడమే జట్టు బలహీనతగా మారింది. టాప్ ఆర్డర్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు నిలదొక్కుకోలేకపోతున్నారు. మధ్యలో క్లాసెన్ లాంటి కీలక ఆటగాళ్లు కూడా భారీ ఇన్నింగ్స్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో జట్టు మొత్తంగా బ్యాటింగ్ విఫలమవుతోంది.

ఇక ముందు జరిగే ప్రతి మ్యాచ్ తమకు చివరిదే అనే భావనతో ఆడాల్సిన అవసరం సన్‌రైజర్స్‌దే. ఒక మ్యాచ్ లోనైనా ఓటమి చెందితే... ఇక తమ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. మూడు మ్యాచ్‌ల్లో ఓడితే, లీగ్ దశ ముగిసేలోగా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు జట్టు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచాలి. లేకపోతే టాలెంట్ ఉన్నా... ప్లాన్ లేకపోవడంతో 2025 సీజన్ పూర్తిగా చేజారిపోయే ప్రమాదం అధికంగా ఉంది.

Tags:    

Similar News