కామన్వెల్త్ గేమ్స్‎లో భారత్‎కు పతకాల పంట.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మరో బంగారు పతకం

Commonwealth Games 2022: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది.

Update: 2022-07-31 11:30 GMT

కామన్వెల్త్ గేమ్స్‎లో భారత్‎కు పతకాల పంట.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మరో బంగారు పతకం 

Commonwealth Games 2022: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ క్రీడాకారులు మొత్తం 5 మెడల్స్ సాధిస్తే వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత యువ వెయిట్‌ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ స్నాచ్‌లో ఏకంగా 140 కేజీల బరువు ఎత్తాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద 300 కేజీలతో స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కామన్‌వెల్త్ క్రీడల్లో రికార్డుగా చెబుతున్నారు క్రీడా రంగ నిపుణులు. జెరెమి సాధించిన గోల్డ్ మెడల్ తో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. అంతకుముందు మీరాబాయి చాను కూడా స్వర్ణపతకం సాధించింది.


Tags:    

Similar News