CSK vs DC Match: కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... IPL 2025 లో పవర్‌ప్లేలో చెన్నై పూర్ స్కోర్స్

Update: 2025-04-05 13:13 GMT

CSK vs DC Match: కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... ఐపిఎల్ 2025 లో పవర్‌ప్లేలో చెన్నై 

CSK vs DC Match: ఐపిఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు చెన్నైకి 184 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ లక్ష్యే ఛేదనలో చెన్నై జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 2 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే రచిన్ రవీంద్రను ఢీల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ 3 పరుగులకే ఔట్ చేశాడు.

ఆ తరువాత మరో నాలుగు బంతులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ కూడా 5 పరుగుల స్వల్ప వ్యక్తిగత స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి జట్టు మొత్తం స్కోర్ కేవలం 20 పరుగులు మాత్రమే.

5.3 ఓవర్ల వద్ద ఓపెనర్ డెవోన్ కాన్వే (14 బంతుల్లో 13 పరుగులు) కూడా ఔట్ అయ్యాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో కాన్వే షాట్ ట్రై చేయగా ఎక్స్‌ట్రా కవర్‌లో కాచుకుకూర్చున్న అక్షర్ పటేల్ ఆ బంతిని సింపుల్ క్యాచ్ పట్టేశాడు. దాంతో చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్ 41 మాత్రమే.

ఈ ఐపిఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్ ప్లేలో ఇలా తక్కువ స్కోర్‌కే 3 వికెట్లు పోగొట్టుకోవడం ఇది రెండోసారి.

1)  62/1 vs ముంబై ఇండియన్స్ . 

2)  30/3 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . 

3)  42/1 vs రాజస్థాన్ రాయల్స్ . 

4)  46/3 vs ఢిల్లీ క్యాపిటల్స్ .   


Tags:    

Similar News