Cricket: ఒక‌ప్పుడు స్టార్ బౌల‌ర్‌.. ఇప్పుడు బోట్ క్లీన‌ర్‌. క్రికెట‌ర్ సాడ్ స్టోరీ

Cricket: 1990లలో భారత క్రికెట్‌ను ఆసక్తిగా చూసే వారెవరికైనా హెన్రీ ఒలోంగా పేరు ప్రత్యేకంగా గుర్తుండి ఉంటుంది. 1998లో షార్జాలో జరిగిన కోకాకోలా కప్ ఫైనల్లో జింబాబ్వే తరఫున బరిలోకి దిగిన ఒలోంగా, ఆ మ్యాచ్‌తో ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్స్‌కి గుర్తుంటాడు.

Update: 2025-05-25 10:30 GMT

Cricket: ఒక‌ప్పుడు స్టార్ బౌల‌ర్‌.. ఇప్పుడు బోట్ క్లీన‌ర్‌. క్రికెట‌ర్ సాడ్ స్టోరీ

Cricket: 1990లలో భారత క్రికెట్‌ను ఆసక్తిగా చూసే వారెవరికైనా హెన్రీ ఒలోంగా పేరు ప్రత్యేకంగా గుర్తుండి ఉంటుంది. 1998లో షార్జాలో జరిగిన కోకాకోలా కప్ ఫైనల్లో జింబాబ్వే తరఫున బరిలోకి దిగిన ఒలోంగా, ఆ మ్యాచ్‌తో ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్స్‌కి గుర్తుంటాడు. ఈ మ్యాచ్‌లో స‌చిన్ అద్భుత బ్యాంటింగ్‌తో కేవ‌లం 92 బంతుల్లో 124 ప‌రుగులు చేశాడు. అయితే అంత‌కు ముందు మ్యాచ్‌లో మాత్రం ఒలోంగా త‌న అద్భుత బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఆ మ్యాచ్ ఒలోంగా పేరు భారత అభిమానుల మనస్సుల్లో బ‌లంగా ముద్ర‌ప‌డింది. అయితే క్రికెట‌ర్‌గా జీవితం సాఫీగా సాగుతోంద‌నుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న జీవితం ఒక్క‌సారిగా మారింది. 2003 ప్రపంచ కప్ సమయంలో జరిగిన సంఘటనతో ఊహించ‌ని మ‌లుపు ఎదురైంది.

జింబాబ్వే పాలకుడు రాబర్ట్ ముగాబే నియంత పాలనకు వ్యతిరేకంగా, అతని సహచరుడు ఆండీ ఫ్లవర్‌తో కలిసి “ప్రజాస్వామ్య మరణం”పై శాంతియుత నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించాడు. దీనిని ప్ర‌భుత్వ వ్య‌తిరేక చ‌ర్య‌గా గుర్తించిన ప్ర‌భుత్వం ఇబ్బందుల‌కు గురి చేసింది. దీంతో ఒలోంగా దేశాన్ని వ‌దిలి వెళ్లాల్సి వ‌చ్చింది. తొలుత ఇంగ్లాండ్‌కు, ఆపై ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఒలోంగా జింబాబ్వేను చూడలేదు. ముఖ్యంగా తన 80 ఏళ్ల తండ్రిని 20 ఏళ్లుగా కలవలేకపోవడం అతన్నిఇబ్బందికి గురి చేసింది.




జింబాబ్వే నుంచి వెళ్లిన తర్వాత, ఒలోంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. సంగీతం పట్ల ఉన్న ఆసక్తితో కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నించాడు. వివిధ టీవీ షోల్లో, బార్లలో పాటలు పాడుతూ జీవనం సాగించేందుకు ప్రయత్నించాడు. అయితే సంగీత పరిశ్రమ ఆశించిన స్థాయిలో ఆదరణ ల‌భించ‌క‌పోవ‌డంతో ఆ మార్గంలోనూ కష్టాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం అతను యూట్యూబ్‌లో కొన్ని పాటలను విడుదల చేస్తున్నాడు.

ప్రస్తుతం ఒలోంగా ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నాడు. స్థిరమైన ఆదాయం లేకపోవడంతో బోటు శుభ్రం చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఇది ఎక్కువ ఆదాయం ఇవ్వకపోయినా, ప్రశాంతంగా జీవించడానికి దోహదపడుతోందని ఒలోంగా చెబుతున్నాడు. తన బాధను బయటపెడుతూ ‘‘ఇప్పుడు జీవించడానికి ఏ పని అయినా చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ, కనీసం సమస్యలు లేకుండా ఉండటమే ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News