Asia Cup: ఆసియా కప్ మ్యాచ్‌లపై సరికొత్త వివాదం
Asia Cup: పాక్‌లో జరగాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు
Asia Cup: ఆసియా కప్ మ్యాచ్‌లపై సరికొత్త వివాదం
Asia Cup: ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు తరలిపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. కనీసం నాలుగు మ్యాచ్‌లైనా తమ దేశంలో నిర్వహించాలని.. లేదంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి తప్పుకుంటామని PCB ఛైర్మన్ నజామ్ సేథీ బెదిరింపులకు దిగారు. మొదటి రౌండ్‌లోని నాలుగు మ్యాచ్‌లైనా పాక్‌లో ఆడించకుంటే టోర్నీలో తమ జట్టు ఆడదన్నారు.
సెప్టెంబర్‌లో ఆసియాకప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలతో టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. దాంతో, భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో, మిగిలిన మ్యాచ్‌లు పాక్‌లో నిర్వహించేలా PCB హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. కానీ, దీనికి ACC సభ్య దేశాలు ఒప్పుకోలేదు. దాంతో, టోర్నీని పాక్ నుంచి తరలించి శ్రీలంకలో నిర్వహించాలని ACC నిర్ణయించింది. దీనిపై పాక్ బోర్డు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.