MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై మేనేజర్‌ క్లారిటీ!

Clarity on MS Dhoni Retirement: కరోనా వైరస్ వలన నష్టపోయిన రంగాల్లోకి క్రీడారంగం ఒకటి.. పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.

Update: 2020-07-09 08:36 GMT
Clarity on Dhoni retirement: Dhoni Manager gives clarity on his retirement speculations

Clarity on MS Dhoni Retirement: కరోనా వైరస్ వలన నష్టపోయిన రంగాల్లోకి క్రీడారంగం ఒకటి.. పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.. ఇక క్రికెట్ ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ కూడా వాయిదా పడింది.. అయితే ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపైన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా 2020 సంవత్సరం ముగించబోమని స్పష్టంచేశారు.. ఐపీఎల్ పైన ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంది..

గతేడాది ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు ధోనీ .. ఇండియన్ ఆర్మీకి కొన్ని రోజులు సేవలందించాడు.. మళ్లీ ఐపీఎల్ లో సత్తా చాటి జట్టులోకి చోటు సంపాదించాలని ధోని ఎదురుచూస్తున్నాడు. అయితే ఐపీఎల్ వాయిదా పడడంతో ధోని రిటైర్మెంట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు . తమ అభిమాన ఆటగాడిని మళ్లీ జట్టులో చూస్తామా అన్న అనుమానం వారికి కలుగుతుంది.. ఈ క్రమంలో ధోనీ మేనేజర్ మహిర్‌ దివాకర్‌ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.. ధోనీ రిటైర్మెంట్ గురించి ఇప్పుడే ఆలోచన లేవని ఆయన స్పష్టం చేశారు.. "మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి తన క్రికెట్‌ గురించి మాట్లాడుకోం. కానీ, ధోనీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం చెబుతున్నా.. తనకి రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవు". అంటూ ఆయన పేర్కొన్నాడు.

ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 4876 రన్స్ చేశాడు. ఇక 350 వన్డేల్లో 10773 రన్స్ చేశాడు. అటు 98 టీ20లు ఆడి 1617 రన్స్ చేశాడు. గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత ధోని జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తన సొంత ఊళ్ళోనే సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నాడు ధోని. 

Tags:    

Similar News