CSK VS SRH: హైదరాబాద్‌పై చెన్నై విజయం

CSK VS SRH: 78 పరుగుల తేడాతో చెన్నై గెలుపు

Update: 2024-04-29 04:58 GMT

CSK VS SRH: హైదరాబాద్‌పై చెన్నై విజయం

CSK VS SRH: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపిస్తూ సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆశించిన ఆరంభం రాలేదు. పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హెడ్ , అభిషేక్ శర్మతో పాటు సబ్స్ స్టిట్యూట్ ప్లేయర్ అల్మొప్రీత్ సింగ్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి సన్ రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నితీష్ రెడ్డి, మార్కరం బ్యాట్ ఝళిపించే క్రమంలో పెవిలియన్ బాట పట్టారు. ఆశలు పెట్టుకున్న క్లాసన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడి 20 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఓటమి ఖరారైంది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్య ఛేదనలో ఎప్పటికప్పుడూ వెనకబడుతూనే వస్తుంది.

చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే నాలుగు వికెట్లు పడగొట్టగా.. పతిరానా, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజా, శార్దూల ఠాకూర్ కు తలో వికెట్ లభించింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 98పరుగులకు తోడు డారిల్ మిచెల్ 52, దూబే 39 పరుగులతో మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, ఉనాద్కట్ తలో వికెట్ తీసుకున్నారు.

Tags:    

Similar News