IPL 2025: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ.. భారీగా తగ్గిన జీతం.. ఎంతో తెలుసా?

IPL 2025: జులై 31న జరిగిన బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలో ఈ నిబంధనను సీఎస్‌కే యాజమాన్యానికి చెప్పగా, కొన్ని ఫ్రాంచైజీలు కూడా వ్యతిరేకించాయి.

Update: 2024-08-18 05:15 GMT

IPL 2025: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ.. భారీగా తగ్గిన జీతం.. ఎంతో తెలుసా?

MS Dhoni as uncapped player: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన మాజీ కెప్టెన్ MS ధోనిని IPL-2025 కోసం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ధోని రిటెన్షన్ BCCI పాత నిబంధనపై ఆధారపడి ఉంటుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ నియమం ప్రకారం, కనీసం 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ కేటగిరీలో ఉంచాలి.

జులై 31న జరిగిన బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలో ఈ నిబంధనను సీఎస్‌కే యాజమాన్యానికి చెప్పగా, కొన్ని ఫ్రాంచైజీలు కూడా వ్యతిరేకించాయి. CSK CEO కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ..- 'నాకు దీని గురించి ఎటువంటి సమాచారం లేదు. మేం కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నిబంధనను కొనసాగించవచ్చని వారే (బోర్డు) మాకు చెప్పారు. అయితే, ఇంకా అలాంటిదేమీ ప్రకటించలేదు. నిబంధనలను బీసీసీఐ త్వరలోనే ప్రకటిస్తుందని అన్నాడు.

అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ రూల్‌ను అమలు చేస్తే, భారత మాజీ కెప్టెన్, CSK కెప్టెన్ MS ధోనీ కేవలం 4 కోట్ల రూపాయలతో IPL సీజన్‌ను ఆడటం చూడవచ్చు. ఎందుకంటే, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను రిటైన్ చేయడానికి అయ్యే ఖర్చు 4 కోట్ల రూపాయలు. ఈ రిటెన్షన్ ధర గత సీజన్ కంటే 3 రెట్లు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత సీజన్‌లో CSK ధోనిని రూ. 12 కోట్లకు రిటైన్ చేసింది.

ధోనీ మాట్లాడుతూ - ఐపిఎల్ 2025కి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటూ ధోని చెప్పుకొచ్చాడు.

భారత జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోని నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు. ఆగస్టు 15, 2020 న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇటీవలే ఆయన పదవీ విరమణ చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. వన్డే ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

గత సీజన్‌లో కూడా అతను తక్కువ డబ్బుకు రిటైన్ అయ్యాడు.

ఐపిఎల్ చివరి సీజన్‌లో CSK ధోనిని 12 కోట్ల రూపాయలకు ఉంచుకుంది. దీనికి ముందు, అతను వరుసగా అనేక సీజన్లలో 15 కోట్ల రూపాయలకు రిటైన్ అయ్యాడు.

గత సీజన్‌లో CSK కెప్టెన్సీని వదిలిపెట్టిన MS ధోని, CSK కోసం 5 సార్లు IPL ట్రోఫీని గెలుచుకున్నాడు. గత సీజన్ ప్రారంభానికి ముందే జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టు కమాండ్‌ని అప్పగించారు. అయితే కొత్త కెప్టెన్ సారథ్యంలో సీఎస్ కే జట్టు రాణించలేక టాప్-4కి అర్హత సాధించలేకపోయింది.

ధోని IPL కెరీర్..

MS ధోని IPL ప్రతి సీజన్‌లో లీగ్ ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకరు. ఐపీఎల్ 17 సీజన్లలో 264 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను 39.13 సగటు, 137.54 స్ట్రైక్-రేట్‌తో 5243 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News