IPL ChatGPT: ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకునే ప్లేయర్‌ అతనే.. షాక్‌ ఇచ్చిన ఛాట్‌జీపీటీ!

ChatGPT Predicts IPL 2025: ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ టాప్ 5 కోసం చెట్‌జీపీటీ అంచనా వేసిన లిస్టులో 4 భారతీయులే!

Update: 2025-03-22 06:06 GMT

IPL ChatGPT: ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకునే ప్లేయర్‌ అతనే.. షాక్‌ ఇచ్చిన ఛాట్‌జీపీటీ!

ChatGPT Predicts IPL 2025 Winner Virat Kohli in 1st Place

IPL ChatGPT: ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌కు కొత్త రన్ మెషీన్లు పుట్టుకొస్తున్నారు. అందుకే ప్రతీ ఏడాది ఆరెంజ్ క్యాప్ కోసం జరిగే పోటీ ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంది. ఈసారి కూడా అది జరగడం ఖాయమే! అటుమనకన్నా ముందే చెట్‌జీపీటీ ఓ అంచనా వేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే టాప్ 5 రన్స్‌ మెషీన్లు ఎవరో చెప్పేసింది. ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా నాలుగురు భారతీయ ప్లేయర్లే ఉన్నారు.

చెట్‌జీపీటీ ఫస్ట్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీని కూర్చోబెట్టింది . 2024 సీజన్‌లో 741 పరుగులు చేసిన కోహ్లీ, ఇప్పటివరకు 8,000కి పైగా పరుగులతో ఐపీఎల్‌లో టాప్ రన్‌గెట్టర్. రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కోహ్లీకి మళ్లీ ఫేవరెట్ ట్యాగ్ దక్కింది. అతని నిలకడ, స్ట్రైక్‌రేట్, భారీ ఇన్నింగ్స్‌లు ఆతని పేరు ముందుంచాయి.

రెండో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉన్నాడు . 2023లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ యువ బ్యాట్స్‌మన్‌ 890 పరుగులతో బిగ్‌ హైప్ సృష్టించాడు. ఈసారి కూడా అదే ఊపుతో దూసుకెళ్లే అవకాశముందని చెట్‌జీపీటీ చెబుతోంది.

మూడో ప్లేస్‌లో KL రాహుల్ ఉన్నాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రాహుల్.. గత సీజన్‌లో 520 పరుగులతో కన్‌సిస్టెన్సీ చూపించాడు.

నాలుగో ప్లేస్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు . 2021లో ఆరెంజ్ క్యాప్ సాధించిన అతడు, గత ఏడాది కూడా 583 పరుగులు చేశాడు.

ఇక ఐదో స్థానం మాత్రమే విదేశీ ఆటగాడి ఖాతాలోకి వెళ్ళింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ బీస్ట్ ట్రావిస్ హెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 2024లో 191 స్ట్రైక్‌రేట్‌తో 567 పరుగులు సాధించిన హెడ్, ఈసారి డేంజర్ మ్యాన్‌గా మారే చాన్స్ ఉందని చెట్‌జీపీటీ చెబుతోంది.

Tags:    

Similar News