US Open 2022: చరిత్ర సృష్టించిన కార్లోస్ అల్కరాజ్.. అతిచిన్న వయస్సులో..
Carlos Alcaraz: స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
US Open 2022: చరిత్ర సృష్టించిన కార్లోస్ అల్కరాజ్.. అతిచిన్న వయస్సులో..
Carlos Alcaraz: స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అతిచిన్న వయస్సులో ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరిన 19 ఏళ్ల అల్కరాజ్ నార్వేకి చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన హోరా హోరి పోరులో 6-4, 2-6, 7-6తో ఘన విజయం సాధించాడు. దీంతో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని సైతం కైవసం చేసుకున్నాడు. రఫెల్ నాదల్ 2005 తర్వాత 19 ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన అతి చిన్న వయసులో వరల్డ్ టాప్ ర్యాంక్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. తొలిసారిగా యూఎస్ ఓపెన్ ఆడుతున్న అల్కరాజ్, రూడ్‌ల మధ్య దాదాపు మూడున్నర గంటలపాటు ఆధ్యంతం నువ్వానేనా అన్నట్లుగా ఆట సాగింది. ఇద్దరు విజయం కోసం చివరి వరకు పోరాడారు. తొలిసెట్‌లో అల్కరాజ్ 6-4 తేడాతో రూడ్‌పై పైచేయి సాధించాడు.