Bhuvneshwar Kumar: భువీకి టెస్టులపై ఆసక్తి తగ్గుతుందా?

Bhuvneshwar: డబ్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో చోటు సంపాదించలేక పోయాడు భువనేశ్వర్ కుమార్.

Update: 2021-05-15 12:42 GMT

భువనేశ్వర్ (ఫొటో ట్విట్టర్)

Bhuvneshwar Kumar: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఫైనల్, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో చోటు సంపాదించలేక పోయాడు భువనేశ్వర్ కుమార్. ఈ మేరకు ఇకపై టెస్ట్ క్రికెట్ ఆడేందుకు తగిన ఆసక్తి చూపడని రిపోర్ట్‌లు వెల్లడిస్తున్నాయి.

ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తలపడే ముందు.. జూన్ లో డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీం ఇండియా. ఈమేరకు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్దుల్ ఠాకూర్‌లను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇంగ్లాండ్‌ పిచ్‌లపై బౌలర్లు స్వింగ్, సీమ్‌లతో రాణించేందుకు అవకాశం ఉంది. ఈ విభాగంలో భువనేశ్వర్ టీం ఇండియాకు ఎంతో కీలకం కానున్నాడు. కానీ, ఆ అవకాశం కోల్పోవడంతో కొంత నిరాశలో ఉన్నాడని, ఈమేరకు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడక పోవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది.

ఈ నివేదిక మేరకు.. భువనేశ్వర్ ఇకపై టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సముఖంగా లేడు. ఆటలో తన డ్రైవ్ మారిపోయింది. అతన్ని దగ్గరగా చూసిన వారి మాటల మేరకు ప్రాక్టిస్ ‌లో కూడా తగిన ఇంట్రస్ట్ చూపడం లేదని, అంత సురీర్ఘంగా బౌలింగ్ చేసేందుకు తగిన ఉత్సాహం చూపడం లేదని తెలుస్తోందని పేర్కొంది.

అలాగే "ఇషాంత్ ఇండియన్ టీం కు చాలా కాలంగా వెన్నుములా ఉన్నాడు. కానీ గాయల కారణంగా కొన్ని సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ లపైనే ఎక్కువగా భారం పడుతోంది. ఈ ఇద్దరూ ఈ మధ్య బాగా రాణిస్తున్నారు. మరో పేసర్ ఉమేష్.. ఒక ఆఫ్షన్ లానే కనిపిస్తున్నాడని వెల్లడించింది.

ఇంగ్లాండ్ చేరుకున్న తరువాత టీం ఇండియా మొదటి నాలుగు రోజులు కేవలం హోటల్ గదుల్లోనే గడపనున్నారు. ఆ తరువాత నాలుగు రోజులు ఆ హోటల్ పరిసరాల్లో సాధన చేయనున్నారు.

ఇంగ్లాండ్ లో బౌలర్లు రాణించాలంటే కనీసం రెండు వారాల ప్రాక్టీస్ అవసరం అవుతుంది. కానీ, ఆ సమయం మన బౌలర్లకు ప్రస్తుత సిరీస్‌లో దొరకడం లేదు. 2013 లో టెస్ట్ అరంగేట్రం చేసిన భువనేశ్వర్.. 21 మ్యాచుల్లో ఆడాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 63 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మ్యాచ్‌లో 5 వికెట్లను 4 సార్లు తీయగా, 4 వికెట్లను 3 సార్లు తీశాడు.

Tags:    

Similar News