IND vs SA : టీమిండియాకు భారీ షాక్.. అనారోగ్యంతో సౌతాఫ్రికా సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగారు.
IND vs SA : టీమిండియాకు భారీ షాక్.. అనారోగ్యంతో సౌతాఫ్రికా సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగారు. ఈ మ్యాచ్‌లు లక్నో, అహ్మదాబాద్‌లలో జరగనున్నాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. బిసిసిఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అక్షర్ పటేల్‌పై అప్‌డేట్ ఇచ్చింది. అలాగే అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడి పేరును కూడా ప్రకటించింది.
అక్షర్ పటేల్ ఆకస్మికంగా జట్టు నుంచి వైదొలగడానికి గల కారణం గాయం కాదు, అనారోగ్యం. సిరీస్‌లోని మూడో మ్యాచ్‌కు ముందే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సరిగా కోలుకోకపోవడం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అక్షర్ లక్నోలోనే ఉన్నారు. అక్కడే ఆయనకు తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనారోగ్యం కారణంగానే ఆయన మూడో మ్యాచ్ ఆడలేకపోయారు.
అక్షర్ పటేల్ స్థానంలో సెలక్షన్ కమిటీ బెంగాల్‌కు చెందిన స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది. షాబాజ్ అహ్మద్ లక్నో, అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. అక్షర్ లేకపోవడం టీమిండియాకు కొంత లోటు అయినప్పటికీ, షాబాజ్ రాకతో ఆల్‌రౌండర్ విభాగంలో కొంత బలం చేకూరవచ్చు.
మరోవైపు, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడో మ్యాచ్‌కు ముందు అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చివరి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో అతని పేరు ఉంది. అంటే, బుమ్రా చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు, త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉంది.
చివరి 2 మ్యాచ్‌లకు టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.