Breaking News: క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ కన్నుమూత
Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూశాడు.
Breaking News: క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ కన్నుమూత
Shane Warne: క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశాడు. థాయిలాండ్‌లో ఉన్న షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరు గాంచిన వార్న్.. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్న షేన్ వార్న్.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో వాడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో మొత్తం 145 టెస్టులు ఆడిన వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేలు ఆడి 293 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.