IND vs AUS: ఢిల్లీ టెస్ట్‌లో కుప్పకూలిన ఆస్ట్రేలియా
IND vs AUS: ఏడు వికెట్లు తీసి సత్తా చాటిన జడేజా
IND vs AUS: ఢిల్లీ టెస్ట్‌లో కుప్పకూలిన ఆస్ట్రేలియా
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు కంగారులకు చుక్కలు చూపించారు. మూడో రోజు 61 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను భారత స్పినర్లు జడేజా, అశ్విన్ వణికించారు. రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. జడేజా 7 వికెట్లు తీసి విశ్వరూపం చూపించాడు. అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, జడేజా స్పిన్ జోరుకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరూ క్రీజ్‌లో పట్టుమని పది నిమిషాలు కూడా నిలవలేకపోయారు. భారత్ విజయానికి 115 పరుగులు కావాలి.