IND vs AUS: మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. భారత్‌పై ఆసీస్ విజయం
IND vs AUS: ఉత్కంఠపోరులో ఆసీస్ విజయం
IND vs AUS: మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. భారత్‌పై ఆసీస్ విజయం
IND vs AUS: టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్ విజయం సాధించింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్ లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాక్స్‌వెల్ 104 పరుగుల మెరుపు సెంచరీతో చెలరేగాడు. భారత్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మొదటి రెండు బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 4 బంతుల్లో 16గా మారింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ మూడో బంతికి సిక్స్, నాలుగో బంతికి ఫోర్ బాదాడు. ఐదో బంతికి కూడా మ్యాక్సీ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదడంతో ఆసీస్ విజయం సాధించింది.