Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్టు

Virat Kohli: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పాత్రను ఎప్పటికీ మరచిపోలేం. అతని రికార్డులు, లీడర్‌షిప్, ఆత్మవిశ్వాసం, టెస్ట్ క్రికెట్‌పై ఉన్న ప్రేమతో తాను క్రికెట్ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

Update: 2025-05-12 12:45 GMT

Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్టు

Virat Kohli: ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. భారత క్రికెట్ అభిమానులను ఈ వార్త తీవ్రంగా కలిచివేసింది. దాదాపు 14 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు వెన్నెముకగా నిలిచిన కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ పోస్ట్ చేయగా, ఆయన భార్య అనుష్క శర్మ కూడా భావోద్వేగంతో స్పందించారు.

విరాట్ కోహ్లీ ఎమోషనల్ నోటు

"తెల్ల దుస్తుల్లో 14 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. అయితే నా ప్రయాణం ఇంత గొప్పగా ఉంటుందని అసలు ఊహించలేదు. ఈ 14 ఏళ్లలో ఎన్నో సంఘటనలు, ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. టెస్ట్ క్రికెట్ అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఈ ఫార్మాట్ నాకు ఇచ్చిన గౌరవం, ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను" అని కోహ్లీ పేర్కొన్నాడు.

"ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తేలిక కాదు. కానీ ఇది సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం అని నమ్ముతున్నాను. నా ఆటతో నాకు క్రికెట్ తిరిగి ఇచ్చింది ఎంతో ఎక్కువ. నా సహచర క్రీడాకారులకు, అభిమానులకు, మద్దతుదారులకు ధన్యవాదాలు. ఈ ప్రయాణాన్ని చిరునవ్వుతో మళ్లీ తిరిగి చూసుకునేంత గొప్పగా సాగింది" అని కోహ్లీ తన సందేశాన్ని ముగించాడు.

అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంపై అనుష్క శర్మ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ఆమె రాసిన మాటలు నెటిజన్లను కదిలిస్తున్నాయి.

"నీ రికార్డులు, మైలురాళ్లను అందరూ గుర్తుంచుకుంటారు. కానీ నీ కంటి వెనుక దాగి ఉన్న కన్నీళ్లు, నీవు చేసిన పోరాటం, టెస్ట్ క్రికెట్‌పై నీ ప్రేమను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి సిరీస్ తర్వాత నీవు ఎంత కష్టపడి తిరిగి వచ్చావో చూస్తూ ఉండటం నాకు గర్వంగా అనిపించింది" అని అనుష్క పేర్కొంది.

"ఎప్పుడో ఒక రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌ను వీడతావని తెలుసు. కానీ నీ మనసు చెప్పిన నిర్ణయాన్ని తీసుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ ఆట నుంచి నీవు గౌరవంగా, ప్రేమతో గుడ్ బై చెబుతున్నావు. నీవు ఈ గుడ్ బైకి అర్హుడివి" అంటూ అనుష్క భావోద్వేగంగా పోస్ట్ పెట్టింది.


Tags:    

Similar News