Allu Arjun: ఆర్సీబీ విజయంతో అల్లు అర్జున్ తనయుడు భావోద్వేగం..వీడియో వైరల్

Update: 2025-06-04 00:24 GMT

 Allu Arjun: ఆర్సీబీ విజయంతో అల్లు అర్జున్ తనయుడు భావోద్వేగం..వీడియో వైరల్

Allu Arjun: ఆర్సీబీ ఐపీఎల్ తొలి టైటిల్ గెలించింది. దీంతో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు, కోహ్లీ అభిమానులు టపాసులు కాల్చుతూ సంబురాల్లో మునిగితేలారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖలు కూడా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుకు శుభాంక్షలు చెబుతున్నారు. అంతేకాదు తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్, కోహ్లీకి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించిన వేళ అయాన్ భావోద్వేగానికి గురయ్యాడు. తలపై బాటిల్ తో నీళ్లు కుమ్మరించుకుని విభిన్నంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ పోస్టు ను అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 



Tags:    

Similar News