Yuzvendra Chahal Divorce: విడాకులపై చాహల్ వ్యాఖ్యలు.. ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్‌తో కౌంటర్!
Yuzvendra Chahal Divorce: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల తర్వాత కేవలం కొన్ని గంటల్లోనే మాజీ భార్య ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Yuzvendra Chahal Divorce: విడాకులపై చాహల్ వ్యాఖ్యలు.. ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్‌తో కౌంటర్!
Yuzvendra Chahal Divorce: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల తర్వాత కేవలం కొన్ని గంటల్లోనే మాజీ భార్య ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు దీనిని చాహల్ వ్యాఖ్యలకు ప్రత్యుత్తరంగా భావిస్తున్నారు.
ధనశ్రీకి దుబాయ్‌లో కొత్త ప్రారంభం
విడాకుల అనంతరం ధనశ్రీ వర్మ దుబాయ్‌కు తరలి వెళ్లారు. అక్కడి జీవితం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఇటీవలి రోజులలో అక్కడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"ఓ జీవితాంతం అనిపించిన తరువాత మళ్లీ దుబాయ్‌కు తిరిగొచ్చాను. ఇక్కడే పెరిగినందున, నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ నగరం అభివృద్ధి చూసి నా మనసు కదిలిపోయింది" అంటూ ఆమె భావోద్వేగపూరితంగా రాశారు. హిందూ ఆలయ సందర్శన అనుభవాన్ని కూడా ఆమె తన పోస్టులో పంచుకున్నారు.
2020లో పెళ్లి.. 2022 నుంచి వేరుపాటు
చాహల్, ధనశ్రీలు డిసెంబర్ 2020లో వివాహ బంధంలోకి ప్రవేశించారు. కానీ ఏడాదిన్నర తరువాత విభేదాల కారణంగా వేరుగా ఉండటం ప్రారంభించారు. 2022 జూన్ నుంచి విడిగా జీవిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న, ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలయింది. కోర్టు వారిద్దరికి విడాకులను మంజూరు చేసింది.
ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ధనశ్రీకి చాహల్ రూ. 4 కోట్లకు పైగా భరణం ఇచ్చినట్టు వార్తలు వెల్లడి చేశాయి.
‘షుగర్ డాడీ’ కామెంట్‌తో చర్చకు దారితీసిన చాహల్
విడాకుల చివరి విచారణకు హాజరైనప్పుడు చాహల్ ధరించిన టీషర్ట్‌పై “Be Your Own Sugar Daddy” అనే వాక్యం ఉండటంతో అది వైరల్ అయింది.
దీంతో ధనశ్రీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది చాహల్ అభిమానులు ఆమెను 'షుగర్ డాడీ వైఫ్' అంటూ ట్రోల్ చేశారు.
పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు.. ధనశ్రీ ప్రశాంత కౌంటర్?
తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చాహల్.. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు.
"ప్రస్తుతం నేను ఎవరి అభిప్రాయాలనూ పట్టించుకోను. విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితికి కారణం నేను కాదు.
ఇది ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం కాదు, ఒక సందేశాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను," అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల తరువాత, ధనశ్రీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఫొటోలు, సందేశాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది.
చాహల్ కామెంట్లకు ఇది ఇన్‌డైరెక్ట్ రిప్లైగా భావిస్తున్నారు.