Gymkhana Ground: తొక్కిసలాటకు HCA వైఫల్యమే కారణం.. ఎవ్వరూ చనిపోలేదు.. అడిషనల్ సీపీ చౌహాన్

Gymkhana Ground: తొక్కిసలాటకు HCA వైఫల్యమే కారణం.. ఎవ్వరూ చనిపోలేదు.. అడిషనల్ సీపీ చౌహాన్

Update: 2022-09-22 08:13 GMT

Gymkhana Ground: తొక్కిసలాటకు HCA వైఫల్యమే కారణం.. ఎవ్వరూ చనిపోలేదు.. అడిషనల్ సీపీ చౌహాన్

Gymkhana Grounds: ఆదివారం నాడు ఉప్పల్‌ స్టేడియంలో జరగబోయే భారత్‌-ఆసీస్ చివరి టీ20 మ్యాచ్‌ టికెట్ల విషయంలో ‌HCA ఘోరంగా వైఫల్యం చెందిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ జింఖానా గ్రౌండ్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. HCA సమన్వయలోపంతోనే ఘటన జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని, టికెట్ల అమ్మకాల్లో HCA క్లారిటీ ఇవ్వకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

జింఖానా గ్రౌండ్‌ దగ్గర తొక్కిసలాట ఘటనకు HCA వైఫల్యమే కారణమని అడిషనల్‌ సీపీ చౌహాన్‌ అన్నారు. గేట్‌లోకి అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని, ఈ తోపులాటలో కొందరికి గాయాలయ్యాయన్నారు. తొక్కిసలాటలో పోలీసులకు కూడా గాయపడ్డారని చెప్పిన చౌహాన్.. ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. టికెట్ల కౌంటర్లు పెంచాలని HCA కు ముందే చెప్పామని, అయినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. 

Tags:    

Similar News