Ayush Mhatre : ఒకే ఓవర్లో ఏడు సిక్సులు..రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ముంబై యువ సంచలనం!

Ayush Mhatre : భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఉద్భవించింది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మ్హాత్రే ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో విదర్భపై కేవలం 53 బంతుల్లో విధ్వంసకర సెంచరీ సాధించి తన జట్టును గెలిపించాడు.

Update: 2025-11-29 05:04 GMT

Ayush Mhatre : ఒకే ఓవర్లో ఏడు సిక్సులు..రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ముంబై యువ సంచలనం!

Ayush Mhatre : భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఉద్భవించింది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మ్హాత్రే ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో విదర్భపై కేవలం 53 బంతుల్లో విధ్వంసకర సెంచరీ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయుష్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (ఫస్ట్‌క్లాస్, లిస్ట్ A, T20) సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్ Aలో ముంబై, విదర్భ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మ్హాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టీ20 మ్యాచ్ లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విదర్భ తరఫున అథర్వ తైడే (64), అమన్ మొఖాడే (61) అద్భుతమైన ఆరంభం ఇచ్చినా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు విఫలం కావడంతో జట్టు 192 పరుగులకే పరిమితమైంది.

193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై జట్టు, ఆయుష్ అద్భుత ప్రదర్శనతో కేవలం 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 18 ఏళ్ల ఆయుష్ మ్హాద్రే ముంబై ఛేజింగ్‌లో సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 53 బంతుల్లో నాటౌట్‌గా 110 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయుష్ 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు, అంటే కేవలం బౌండరీల నుంచే 80 పరుగులు రాబట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 207.54గా నమోదైంది. మాత్రేతో పాటు సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35), శివమ్ దూబే (19 బంతుల్లో 205.26 స్ట్రైక్ రేట్‌తో 39* పరుగులు) కూడా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

20 ఫార్మాట్‌లో ఇది ఆయుష్‌కు తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను ఫస్ట్‌క్లాస్, లిస్ట్ A, టీ20 అనే మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అతను ఈ ఘనతను 18 సంవత్సరాల 135 రోజుల వయస్సులో సాధించాడు. ఆయుష్ ఈ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పే క్రమంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ 19 సంవత్సరాల 339 రోజుల వయస్సులో మూడు ఫార్మాట్లలో సెంచరీలు పూర్తి చేశారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ (20 ఏళ్లు), దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ (20 ఏళ్ల 62 రోజులు) ఉన్నారు.

ఆయుష్ తన చిన్న కెరీర్‌లో ఇప్పటివరకు 13 ఫస్ట్‌క్లాస్, 7 లిస్ట్ A, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో మొత్తం 5 సెంచరీలు నమోదు చేసి, ఫస్ట్‌క్లాస్‌లో 660, లిస్ట్ Aలో 458, టీ20లో 368 పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి 7 మ్యాచ్‌లలో 240 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు.

Tags:    

Similar News