Ramadan 2026: 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్.. ఉపవాస దీక్షలు ఎప్పుడంటే? పూర్తి వివరాలు!

Ramadan 2026: 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న రంజాన్ మాసం. 2026 రంజాన్ ఉపవాస దీక్షలు, నెలవంక దర్శనం మరియు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Update: 2026-02-05 06:59 GMT

Ramadan 2026: 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్.. ఉపవాస దీక్షలు ఎప్పుడంటే? పూర్తి వివరాలు!

Ramadan 2026: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ (రమదాన్) మాసం ఈ ఏడాది ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతోంది. దాదాపు 31 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రంజాన్ మాసం మళ్లీ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. చివరిగా 1995లో ఫిబ్రవరి 1న రంజాన్ మొదలవ్వగా, మళ్లీ ఇప్పుడు 2026లో అదే పునరావృతం కాబోతోంది.

ఎప్పుడు ప్రారంభం?

ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడాన్ని బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన మార్చి 20 లేదా 21వ తేదీల్లో 'ఈద్-ఉల్-ఫితర్' (రంజాన్ పండుగ) వచ్చే అవకాశం ఉందని పండితులు భావిస్తున్నారు.

మూడు భాగాలుగా రంజాన్ ఉపవాసాలు (అష్రాలు):

రంజాన్ మాసంలోని 30 రోజుల ఉపవాస కాలాన్ని మూడు పది రోజుల విభాగాలుగా (అష్రాలు) విభజించారు:

♦ మొదటి 10 రోజులు (రహ్మత్): అల్లాహ్ యొక్క కరుణ కురిసే కాలం.

♦ రెండో 10 రోజులు (బర్కత్): పాప క్షమపణలు పొందే కాలం.

♦ చివరి 10 రోజులు (మగ్ఫిరత్): నరక అగ్ని నుండి విముక్తి పొందే కాలం.

హిజ్రీ శకం.. చంద్రమాన క్యాలెండర్ విశేషాలు:

ఇస్లాం మతస్తులు చంద్రుని గమనాన్ని బట్టి రూపొందించిన చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. క్రీస్తు శకం 622లో ప్రవక్త మహమ్మద్ మక్కా నుండి మదీనాకు వెళ్లిన (హిజ్రత్) నాటి నుండి ఈ 'హిజ్రీ శకం' ప్రారంభమైంది. రంజాన్ అనేది ఈ క్యాలెండర్‌లో 9వ నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం.

ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12 నెలలు:

1. మొహరం, 2. సఫర్, 3. రబీ ఉల్-అవ్వల్, 4. రబీ ఉల్-ఆఖిర్, 5. జమాది ఉల్-అవ్వల్, 6. జమాది ఉస్-సాని, 7. రజబ్, 8. షాబాన్, 9. రంజాన్, 10. షవ్వాల్, 11. జుల్-ఖాదా, 12. జుల్-హిజ్జా.

సెహ్రీ మరియు ఇఫ్తార్ ప్రాముఖ్యత:

సెహ్రీ: సూర్యోదయానికి ముందే భోజనం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించడం.

ఇఫ్తార్: సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమించడం.

Tags:    

Similar News