Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Update: 2021-05-15 00:27 GMT

Daily Horoscope:(File Image) 

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వృఫభరాశి: ఈ రాశి వారు పట్టుదలగా పనిచేసి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారుల కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది.

సింహ రాశి: ఈ రాశి వారికి గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. మిత్రుల ద్వారా మనస్శాంతి లభిస్తుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ఇది కలిసొచ్చే కాలం. అందువల్ల మేలైన భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి అభినందనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.

తులా రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు చేస్తారు. ఎటు చూసినా విజయాలే కనిపిస్తున్నాయి. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశివారు సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. అనేక విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. శత్రుపీడ తొలగుతుంది. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్‌ వస్తుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అనేక అవరోధాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. బంధువుల్లో మిమ్మల్ని అవమానించే వారుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇది మంచి సమయం. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువవుతుంది. రుణాల నుంచి కొద్దిగా బయటపడతారు. సమీప బంధువుతో విభేదాలు రాకుండా కోవాలి.

మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఉద్యోగంలో సహోద్యోగులు అవరోధాలు సృష్టించే అవకాశముంది. ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. 

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

  9381881581

Tags:    

Similar News