Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు వ్యాపార రంగంలో భారీ లాభాలు ఆర్జిస్తారు.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope:(File Image)
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం:5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేష రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఈ రోజు పూర్తి విశావసంతో ఉంటూ కొన్ని కీలక నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఖ్యాతిని పెంచుతుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి మీరు చేసిన పని సమాజంలో ప్రశంసించబడుతుంది. మీ రచనలు ప్రజలచే ప్రశంసించబడతాయి. ఈ రాత్రి మీరు ఏదైనా వివాహం లేదా సామాజిక కార్యక్రమానికి హాజరుకావచ్చు. ఈ రోజు, మీ ఆరోగ్యం కొంచెం అదుపు తప్పుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారు మీ సామర్థ్యంతో ఏదైనా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మానసిక ఆందోళనకు గురికావచ్చు. యోగా, వ్యాయామం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. .
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి ఈ రోజు మీ ముఖ్యమైన పనిని పూర్తిచేయవచ్చు. రాజకీయ రంగంలో, ఈ రోజు మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. పోగొట్టుకున్న వస్తువును కనుగొనవచ్చు. మీరు సామాజిక లేదా రాజకీయ పనులలో బిజీగా ఉండవచ్చు. దీనివల్ల మీరు ఆనందంతోపాటు అలసటను అనుభవిస్తారు.
సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపార రంగంలో భారీ లాభాలు ఆర్జిస్తారు. ఈ పురోగతి మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. మీ పిల్లల నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వినవచ్చు. మీ స్నేహితులు లేదా బంధువులు కొందరు మీ రహస్య విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల, మీ పురోగతి రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది.
కన్యా రాశి: ఈ రాశి వారికి చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలు ఈ రోజు పరిష్కారం కావచ్చు. ఇది మానసిక ఒత్తిడి నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. చాలా కాలంగా పనుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగుస్తుంది. జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, కళలకు సంబంధించిన రంగాలలో ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి.
తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారులు లేదా ఉద్యోగులు ఇతరులకు ప్రమాదం కలిగించే పనులు చేయకూడదు. సంక్షోభం నుంచి బయటపడటానికి, మీరు ఓపికగా పనిచేయాలి. కుటుంబ వ్యాపారంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించడం మానుకోండి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారం లేదా కార్యాలయంలో అనేక రకాల వివాదాలు, విభేదాలు ఏర్పడవచ్చు. వాటిని మీరు వివేకంతో పరిష్కరించాలి. కుటుంబంలో ఏదైనా పాత విషయం లేదా రహస్య శత్రువు కారణంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు కార్యాలయంలోని మీ సహచరులు కొంత రిలాక్స్డ్ మూడ్‌లో ఉంటారు. శ్రద్ధగా పనిచేస్తారు. సృజనాత్మకంగా పని చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. తద్వారా మీలో దాగి ఉన్న ప్రతిభ నుంచి మీరు విజయం సాధిస్తారు.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారం లేదా రంగంలో పెద్ద లాభం కోసం మీరు రోజంతా పనిచేస్తారు. కుటుంబ పెద్దతో భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారు. సమాజ శ్రేయస్సు కోసం కొంత పని చేస్తారు. ప్రజలకు సహాయం చేయడం ద్వారా మానసిక శాంతి కూడా లభిస్తుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ఈ రోజు ఆఫీసులో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా మెలాగాల్సి వుంటుంది. అన్నీ సరిదిద్దేందుకు ప్రయత్నించినా.. సహోద్యోగుల నుంచి మద్దతు లభించదు. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వుండాలి.
మీన రాశి: ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో నైపుణ్యంతో వ్యవహరించి ఆశించిన ఫలితాలు పొందుతారు. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రేమికులకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. కొంతమంది కొత్త వ్యక్తులను కలవడం ఆనందం కలిగిస్తుంది.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581