Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు

Daily Horoscope: వివిధ రాశుల వారి ఫలితాలు

Update: 2021-03-18 01:29 GMT

Daily Horoscope 

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| సోమవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.10 | సూర్యాస్తమయం సా.6.07| తిథి శు.పంచమి రా.గం.11.24వరకు | తదుపరి షష్టి |నక్షత్రం భరణి ఉ.8.28 వరకు| తదుపరి కృతిక|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం 6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.9.48 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.57 పున: మ.2.56 నుంచి మ.3.44 వరకు| అమృతఘడియలు -| కరణం బవ ఉ.10.19| యోగం వైధృతి ఉ.గం.8.12ల వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవదర్శనాలు.

వృషభరాశి: సన్నిహితులు,మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునరాశి: మిత్రులతో మాటపట్టింపులు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరాశ.

కర్కాటకరాశి: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

సింహరాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్యారాశి: రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

తులారాశి: ఆర్థిక భారాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు కొంత నిరుత్సాహం.

వృశ్చికరాశి: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి విముక్తి.

ధనుస్సురాశి: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మకరరాశి: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభరాశి: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనరాశి: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువులతో సఖ్యత. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.

గుల్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Tags:    

Similar News