Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Update: 2021-06-12 02:29 GMT

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| వ‌సంత‌ ఋతువు వైశాఖ‌ మాసం| ఉత్తరాయణం శనివారం,| సూర్యోదయం : 5.28 | సూర్యాస్తమయం సా.6.26| తిథి బ‌.ద్వాద‌శి ఉ.గం.09.18వరకు | తదుపరి త్ర‌యోద‌శి |నక్షత్రం భ‌ర‌ణి పూర్తి మంగ‌ళ‌వారం.5.55 వరకు| తదుపరి కృతిక‌|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ప‌.2.08 నుంచి 3.45 వరకు| దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.17 పున: మ.3.01 నుంచి మ.3.53 వరకు| అమృతఘడియలు రా.12.40 నుంచి 03.49 వ‌ర‌కు

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో ప్రమోషన్‌కు గానీ, ఇంక్రిమెంట్‌కు గానీ అవకాశం ఉంది. అధికార యోగం పట్టవచ్చు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో మిత్రులు సహాయ సహకారాలందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అటు ఉద్యోగంలోనూ, ఇటు ఇంటిలోనూ బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యల పై దృష్టి కేంద్రీకరిస్తారు. మీకు రావాల్సిన బకాయిలు చేతికి అందివస్తాయి

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆరోగ్యం మృదువుగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అతిథులు రాక ఉంటుంది. ఈ కారణంలో ఖర్చులవుతాయి. అంతేకాకుండా ఈ రోజు మీరు కొంచెం ఆందోళనకరంగ ఉంటారు.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఈ రోజు అనుకూల ఫలితాలు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆరోగ్యం మృదువుగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అతిథులు రాక ఉంటుంది. ఈ కారణంలో ఖర్చులవుతాయి. అంతేకాకుండా ఈ రోజు మీరు కొంచెం ఆందోళనకరంగ ఉంటారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల సహాయంతో పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మనస్సులో భగవంతుని నామస్మరణ చేయడం వల్ల మీకు శుభకరంగా ఉంటుంది. మీ ప్రయత్నం వల్ల మీలో విశ్వాసం పెరుగుతాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైన వివాదాలు, తగాదాల నుంచి బయటపడతారు. మీ ఖర్చులను తగ్గించడం ద్వారా మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా మీరు వాహనం ద్వారా ఆనందం పొందుతారు. ఈ రోజు మీ పని పూర్తయినందుకు సంతోషంగా ఉంటారు.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. డబ్బు సంపాదించండ ద్వారా మీ నిధులు పెరుగుతాయి. వత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ హక్కులు పెరుగుతాయి. పోటీ పరీక్షలో విద్యార్థులు విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పని పూర్తిచేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంటి నుంచే పనిచేస్తుంటే అన్ని కార్యాల్లో ప్రయోజనం పొందుతారు. భవిష్యత్తులో మీరు లాభం అందుకుంటారు. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం మంచిది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు మనస్సును కేంద్రీకరించడం ద్వారా అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అందులో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు మీకు ప్రయోజనాలు ఇస్తాయి. సోదరీసోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్ని అంశాలను తనిఖీ చేయండి. బలం పెరిగే సంకేతాలు ఉన్నాయి. మీ వాగ్ధాటితో కళాత్మక నైపుణ్యాలతో మీరు ఇప్పుడు ఉద్దేశాలను అడ్డుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి నిర్మాణ పనుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో మీరు ఖర్చు విషయంలో నియంత్రణ కలిగి ఉండాలి. భవిష్యత్తులో కొంత డబ్బు ఆదా చేయాలి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపుతారు.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు స్నేహితులు, బంధువులు నుంచి ఏదైనా శుభవార్త అందుకుంటారు. మనస్సులో మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపార పరంగా మీకు అనుకూలమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జలుబు, దగ్గుకు దూరంగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Tags:    

Similar News