Viral Video: ఈత కొడుతుంటే.. అకస్మాత్తుగా పాము వచ్చింది.. భయంతో యువకులు పరుగులు..!

Viral Video: ఈ మధ్య కాలంలో ఇంట్రెస్టింగ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ వీడియో ఏది వచ్చినా... అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

Update: 2025-07-07 06:30 GMT

Viral Video: ఈత కొడుతుంటే.. అకస్మాత్తుగా పాము వచ్చింది.. భయంతో యువకులు పరుగులు..!

Viral Video: ఈ మధ్య కాలంలో ఇంట్రెస్టింగ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ వీడియో ఏది వచ్చినా... అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇలాంటిదే ఈ స్విమ్మింగ్ వీడియో కూడా. కొంతమంది యువకులు ఒక కాలువలో ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే గట్టుపైన కూర్చున్న వ్యక్తి దగ్గరకు ఒక పెద్ద పాము వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.

కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక అడవికి దగ్గరలో ఉన్న కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. చాలా సేపటి నుంచి వారంతా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారిలో బాగా అలసిపోయిన యువకుడు గట్టుపైన కూర్చుని స్విమ్మింగ్ చేస్తున్న వాళ్లతో ముచ్చట్లు చెబుతున్నాడు. వీరంతా మైమరిచిపోయి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఎక్కడ నుంచి.. ఎలా చూసిందో ఏమోగానీ ఒక పెద్ద పాము.. గట్టుపై కూర్చుని ఉన్న యువకుడి మీద దాడి చేసింది. అతను కూర్చున్న వెనకాల అంతా పొదలు ఉన్నాయి. ఆ పొదల గుబుర్లోంచి వచ్చిన పాము అతని భుజాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇంతలోనే ఉలిక్కిపడ్డ ఆ యువకుడు ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పరుగులు తీస్తాడు. ఆ యువకుడే కాదు కాలువలో స్విమ్మింగ్‌ చేస్తున్న మిగిలిన వారంతా కూడా ఎటుబడితే అటు భయంతో పరుగులు పెట్టేస్తారు.

పొదల్లోంచి పెద్ద ఆకారంలో ఉన్న పాము అలా ఒక్కసారిగా వచ్చి ఆ యువకుడిపై దాడి చేయడంతో అందరూ ఇప్పుడు ఈ వీడియోని పదే పదే చూస్తున్నారు. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. లక్షల వ్యూస్ వచ్చాయి. ఇదిగో మీరూ ఒక లుక్ వేయండి.


Tags:    

Similar News