Viral Video: జలపాతం అందాలను చూద్దామని వెళితే.. నీటిలో కొట్టికుపోయిన మహిళలు..వైరల్ వీడియో..!
Viral Video: హాలీడే రావడంతో కొంతమంది మహిళలు బీహార్‌లో ఉన్న లంగురియా జలపాతాలను చూడ్డానికి వెళ్లారు.
Viral Video: జలపాతం అందాలను చూద్దామని వెళితే.. నీటిలో కొట్టికుపోయిన మహిళలు..వైరల్ వీడియో..!
Viral Video: హాలీడే రావడంతో కొంతమంది మహిళలు బీహార్‌లో ఉన్న లంగురియా జలపాతాలను చూడ్డానికి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరిగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక గంధరగోళంలో పడిపోయారు. వీరిలో ఇద్దరు వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆదివారం వచ్చింది. ఇంకేముందు హాలీడే కదా అలా సరదాగా జలపాతం చూసొద్దాం.. అని అనుకున్నారు. ఇంకేంముందు వారికి ఆ జలపాతం చుక్కలు చూపించింది. బీహార్‌లోని గయా జిల్లాలో ఉన్న లంగురియా జలపాతం చాలా ఫేమస్. అక్కడ ప్రకృతి ఎప్పుడు అందంగా ఉంటుంది. అందుకే అక్కడకు చాలామంది వెళ్తుంటారు. శెలవు దినం కావడంతో ఆరుగురు మహిళలు సరదాగా వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లారు. వాళ్లు అక్కడకు వెళ్లే సమయానికి నీరు ఎక్కువగా లేదు. దీంతో వారంతా మధ్యలో ఉన్న రాళ్లపై ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది.
ఈ నీటి ప్రవాహాన్ని గమనించిన ఒక మహిళ వెంటనే ఒక బండారాయిని దాటి గట్టుకు చేరుకుంది. ఆమె వెనుక మిగిలిన వాళ్లు కూడా అలానే వెళ్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ప్రవాహం మరింత తీవ్రమైపోయింది. దీంతో పట్టుతప్పి నీటిలో పడిపోయారు. అయితే స్థానికులు వారిని ఎలాగోలా రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటి ప్రవాహాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వర్షాకాలం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జర భద్రంగా ఉండాలని కామెంట్లు కూడా వస్తున్నాయి.