Water Bottle: వాటర్ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు రాసి ఉంటుంది? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారంతే..

Water Bottle Expiry Date: నీటికి గడువు తేదీ లేదు. కానీ, నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లకు ఖచ్చితంగా గడువు తేదీ ఉంటుంది. అందుకే ఈ బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. క్లోజ్డ్ వస్తువు నాణ్యత, భద్రత కాలం ఏమిటో ఈ తేదీ వినియోగదారులకు చెబుతుంది.

Update: 2023-05-22 01:30 GMT

Water Bottle: వాటర్ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు రాసి ఉంటుంది? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారంతే..

Water Bottle Expiry Date: వేసవి కాలం వచ్చింది. ఎండ వేడికి తట్టుకోలేక చాలామంది తెగ నీళ్లు తాగుతుంటారు. ఇక ప్రయాణంలోనైతే చెప్పాల్సిన పనే లేదు.నీరు తాగేటప్పుడు, మనం స్వచ్ఛమైన నీటిని తాగుతున్నామని గుర్తుంచుకోవాలి. అలాగే మంచిదని చాలామంది బాటిల్ వాటర్ తాగుతుంటారు. అయితే వాటర్ బాటిల్‌పై ఎక్స్ పైరీ డేట్ ఎందుకు రాసి ఉంటుందో తెలుసా. ఎందుకంటే నీరు ఎప్పుడూ చెడిపోదని, చాలా రోజులు అలాగే ఉంటుందని నమ్ముతుంటారు. అయితే ఇప్పటికీ సీసాపై గడువు తేదీ ఎందుకు రాసి ఉంటుందని చాలామందికి అనిపిస్తుంటుంది. ఈ విషయం వెనుకగల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

నీటికి ఎక్స్‌పైరీ డేట్ లేదు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నీటికి గడువు తేదీ లేదు. కానీ, నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లకు ఖచ్చితంగా గడువు తేదీ ఉంటుంది. అందుకే ఈ బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. క్లోజ్డ్ వస్తువు నాణ్యత, భద్రత కాలం ఏమిటో ఈ తేదీ వినియోగదారులకు చెబుతుంది. బాటిల్ వాటర్ గడువు తేదీ దాని అత్యధిక నాణ్యతను తెలియజేస్తుంది.

ఆఫ్‌షోర్ నీటి నాణ్యత మరియు భద్రత?

దీనితో పాటు నీటి బాటిళ్లపై ఎక్స్‌పైరీ తేదీని రాయడం వలన వినియోగదారునికి బాటిల్ వాటర్ నాణ్యత, భద్రత కాలం ఎంత అని చెప్వే అవకాశం ఉంటుంది. ఈ తేదీ తర్వాత, నీటి నాణ్యత ప్రభావితం కావచ్చు. వినియోగానికి సురక్షితం కాకపోవచ్చు. ఇది భద్రత, ఆరోగ్యానికి ముఖ్యమైనది.

సీసాపై గడువు తేదీ..

మరొక నివేదిక ప్రకారం, గడువు తేదీ తర్వాత, నీటి నాణ్యత ప్రభావితం కావచ్చు. దానిని వినియోగించడం సురక్షితం కాకపోవచ్చు. గడువు తేదీ దాటితే, వినియోగదారు బాటిల్ వాటర్ తాగకూడదు. నిర్దిష్ట సమయం తర్వాత ప్లాస్టిక్ నీటిలో కరగడం ప్రారంభిస్తుంది. సీసాపై గడువు తేదీని రాయడానికి కారణం ఇదే.

Tags:    

Similar News