Indian Railways: విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే ఏకైక రైల్వేస్టేషన్ ఏదో మీకు తెలుసా? నిమిషాల్లో వేరే దేశం వెళ్లిపోవచ్చు

Indian Railways: ఇటీవల కాలంలో భారతీయ రైల్వే రంగం కొత్త కొత్త రైళ్లను ఏర్పాటు చేసి శరవేగంతో దూసుకుపోతుంది.

Update: 2025-07-11 06:06 GMT

Indian Railways: విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే ఏకైక రైల్వేస్టేషన్ ఏదో మీకు తెలుసా? నిమిషాల్లో వేరే దేశం వెళ్లిపోవచ్చు

Indian Railways: ఇటీవల కాలంలో భారతీయ రైల్వే రంగం కొత్త కొత్త రైళ్లను ఏర్పాటు చేసి శరవేగంతో దూసుకుపోతుంది. ఇప్పటికే లగ్జరీ, సూపర్ ఫాస్ట్ రైళ్లను నిరంతరం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, మన దేశంలోని కొన్ని రైళ్లు ఎక్కితే ఇతర దేశాల సరిహద్దుల వరకు వెళ్లిపోవచ్చు. అసలు మీకు విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే ఏకైక రైల్వేస్టేషన్ ఏదో తెలుసా? ఆ స్టేషన్ వరకు వెళ్లామంటే.. నిమిషాల్లో వేరే దేశం వెళ్లిపోవచ్చు. పాస్ పోర్టు, వీసా కూడా అక్కరలేదు.

ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో భారత దేశం ఒకటి. దూర ప్రయాణాలకు అత్యంత చౌకగా ప్రయాణం చేయాలనుకునేవారికి రైల్వేలు బెస్ట్ ఆప్షన్. ఇండియన్ రైల్వే దేశంలోని నలుమూలకు రైల్వే వ్యవస్థను విస్తరించింది. ప్రయాణికులకు రైళ్లను నిత్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో లగ్జరీ, సూపర్ ఫాస్ట్ రైళ్ల తీసుకొచ్చింది. సాధారణ రైళ్లలో వివిధ రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే, భారతదేశంలోని కొన్ని రైళ్లను ఎక్కతే విదేశాలకు మన దేశంలో ఉన్న సరిహద్దుల వరకు వెళ్లొచ్చు. దీనికోసం ఈ సరిహద్దుల్లో ఉన్న రైల్వేస్టేషన్లకు వెళ్లే రైళ్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ స్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లడం చాలా సింపుల్. అత్యంత ఈజీ...అలాగే ఖర్చు కూడా తక్కువ. ముఖ్యంగా విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే ఏకైక రైల్వేస్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశం నుండి విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే ఏకైక రైల్వేస్టేషన్.. జోగ్బాని రైల్వేస్టేషన్. ఇదే మన దేశంలో ఉన్న చివరి స్టేషన్. నేపాల్‌కు వెళ్లాలనుకునేవారు బీహార్ నుంచి ప్రయాణం మొదలుపెట్టొచ్చు. బీహార్‌‌లోని అరారియా జిల్లాలో ఈ జోగ్బాని రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైలు నేపాల్‌లోని బిరాత్‌నగర్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రైలు ఇండో నేపాల్ దేశాలను కలిపే రైలు కూడా. చాలామంది ప్రయాణికులు నేపాల్‌కు ఈ రైలు ద్వారానే వెళతారు. సరుకుల రవాణా కూడా ఈ రైలు ద్వారానే జరుగుతుంది. రెండు దేశాల వాణిజ్య సంబంధాలకూ ఈ స్టేషన్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ రైలు ద్వారా నేపాల్‌కు వెళ్లాలంటే ఎటువంటి పాస్ పోర్ట్, వీసా అవసరంలేదు.

జోగ్బాని రైల్వేస్టేషన్‌ వరకు వెళ్లాలంటే కోల్ కత్తా వంటి పలు నగరాల నుంచి కొన్ని రైళ్లు ఉన్నాయి. అలాగే కొన్ని స్పెషల్ రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రైళ్లను ఎక్కి జోగ్బాని రైల్వే స్టేషన్ వరకు వెళ్లొచ్చు. అక్కడ నుంచి కాలినడకన నేపాల్ చేరుకోవచ్చు.

Tags:    

Similar News