డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటే ఏమిటి?: దీంతో ఉపయోగాలు ఏంటి?

Diplomatic Passport: కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో తన పాస్ పోర్టును రెన్యూవల్ చేసుకున్నారు.

Update: 2025-02-19 09:10 GMT

డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటే ఏమిటి?: దీంతో ఉపయోగాలు ఏంటి?

Diplomatic Passport: కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో తన పాస్ పోర్టును రెన్యూవల్ చేసుకున్నారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయనకు డిప్లమాటిక్ పాస్ పోర్టు ఉంది. అధికారం నుంచి దిగిపోవడంతో కేసీఆర్ డిప్లమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేసి సాధారణ పాస్ పోర్టును రెన్యూవల్ చేసుకున్నారు. అసలు డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటే ఏంటి? సాధారణ పాస్ పోర్టుకు డిప్లమాటిక్ పాస్ పోర్టుకు ఉన్న తేడా ఏంటి? టైప్ డీ పాస్ పోర్టుగా పిలిచే ఈ పాస్ పోర్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ పాస్ పోర్టు తీసుకునేందుకు ఎవరెవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటే ఏంటి?

డిప్లమాటిక్ పాస్ పోర్టు అనేది ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, ముఖ్యమంత్రులు, వారి కుటుంబాలు అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ప్రత్యేక పాస్ పోర్ట్ ను డిప్లమాటిక్ పాస్ పోర్టు అంటారు. ప్రభుత్వం తరపున అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున విదేశాలకు అధికారిక పర్యటనలకు వెళ్లే వారికి ఈ పాస్ పోర్టును జారీ చేస్తారు. విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసే అధికారులు కూడా ఈ పాస్ పోర్టును పొందేందుకు అర్హులు.

డిప్లమాటిక్ పాస్ పోర్టుతో లాభాలు

డిప్లమాటిక్ పాస్ పోర్టు కలిగిన వారికి ప్రత్యేక హోదా ఇస్తారు. ఈ పాస్ పోర్టు మెరూన్ కలర్ లో ఉంటుంది. విదేశాల్లో పర్యటించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా దేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశాల్లో అడుగుపెట్టిన సమయంలో ఈ పాస్ పోర్టు కలిగినవారిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. తక్కువ ఖర్చు, వీసా ఫీజు ఉండదు. ఎయిర్ పోర్టులలో బోర్డింగ్ సమయంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. ఈపాస్ పోర్టు కలిగిన వారు అరెస్టులు, నిర్బంధాలు, చట్టపరమైన చర్యల విషయంలో రక్షణ కల్పిస్తోంది.

సాధారణ పాస్ పోర్ట్, డిప్లమాటిక్ పాస్ పోర్టుకు తేడా ఏంటి?

సాధారణ పాస్ పోర్టును టైప్ పి పాస్ పోర్ట్ గా పిలుస్తారు. వృత్తి పరమైన లేదా ఇతర అవసరాలకు, విదేశాలకు వెళ్లేందుకు భారతీయ పౌరులకు ఈ పాస్ పోర్టు జారీ చేస్తారు. ఈ పాస్ పోర్టు బ్లూ కలర్ లో ఉంటుంది. ఈ పాస్ పోర్టులో 30 నుంచి 60 పేజీలుంటాయి. ఈ పాస్ పోర్టు మేజర్లకు 10 ఏళ్ల గడువు. మైనర్లకు 5 ఏళ్ల గడువు. ఇక డిప్లమాటిక్ పాస్ పోర్టును అధికారిక కార్యక్రమాలకు వెళ్లే అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులకు జారీ చేస్తారు. ఇది మెరూన్ రంగులో ఉంటుంది. ఈ పాస్ పోర్టులో 28 పేజీలు ఉంటాయి. ఈ పాస్ పోర్టును ఐదేళ్లకు జారీ చేస్తారు. అయితే అంతకంటే తక్కువ కాలానికి జారీ చేస్తారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక వ్యవహారాలపై విదేశాలకు వెళ్లడానికి ఉపయోగిస్తారు.

Tags:    

Similar News